Wednesday, August 12, 2026 10:27 AM
Wednesday, August 12, 2026 10:27 AM

గంటల తరబడి కూర్చుంటున్నారా..? శరీరంలో స్ట్రెస్ ఫ్యాట్..!

ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి అనేది ఒక భాగమైపోయింది. అయితే, కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాదు, మీరు చేసే అధిక పని గంటలు మీ శరీరంలో మొండి కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణమని ఒక కొత్త అధ్యయనం తేల్చిచెప్పింది. రెండు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా సేకరించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు, పని ఒత్తిడికి మరియు స్ట్రెస్ ఫ్యాట్ కు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మనం ఎక్కువ సేపు పని చేస్తున్నప్పుడు లేదా నిరంతరం ఒత్తిడికి గురవుతున్నప్పుడు మన శరీరం కార్టిసోల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది.

Also Read : పోలవరం పనులపై మళ్ళీ తెలంగాణ రచ్చ షురూ..!

దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఈ కార్టిసోల్ స్థాయిలు పెరిగినప్పుడు, అది మన శరీరంలో ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో కొవ్వు నిల్వలను పెంచుతుంది. ఎంత డైట్ పాటించినా, వ్యాయామం చేసినా ఈ కొవ్వు తగ్గకపోవడానికి కారణం వెల్లడించారు. ఊబకాయం లేదా బరువు పెరగడానికి కేవలం తీసుకునే ఆహారం మాత్రమే కారణం అని మనం అనుకుంటాం. కానీ, అధిక పని గంటల వల్ల కలిగే జీవక్రియ మార్పులు ఆహారం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ స్టడీ వెల్లడించింది.

Also Read : బ్రేకింగ్: బిజేపికి షాక్ ఇచ్చిన అన్నాడిఎంకే..!

విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల శరీరంలోని మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీనివల్ల శరీరం శక్తిని ఖర్చు చేసే బదులు, కొవ్వు రూపంలో భద్రపరచడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కువ గంటలు పని చేసే వారిలో నిద్ర తగ్గుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి ఆకలిని పెంచుతుంది, తద్వారా అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఈ అధ్యయనం కేవలం వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వాలకు మరియు కార్పొరేట్ సంస్థలకు కూడా ఒక హెచ్చరికగా నిపుణులు చెప్తున్నారు. పని గంటలను నియంత్రించకపోతే, భవిష్యత్తులో ఊబకాయం, గుండె జబ్బులు మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు పెరిగి ప్రజారోగ్యంపై భారీ భారం పడే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్