Wednesday, August 12, 2026 10:24 AM
Wednesday, August 12, 2026 10:24 AM

పోలవరం పనులపై మళ్ళీ తెలంగాణ రచ్చ షురూ..!

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనులు, పోలవరం లిఫ్ట్ స్కీమ్‌ ను తిరిగి ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఆరోపిస్తూ, వీటిని వెంటనే అడ్డుకోవాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే ఏపీ సర్కార్ ప్రభుత్వం ఈ పనులను చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Also Read : బ్రేకింగ్: బిజేపికి షాక్ ఇచ్చిన అన్నాడిఎంకే..!

గతంలో నిలిపివేసిన లిఫ్ట్ స్కీమ్ పనులను ఇప్పుడు ఏకపక్షంగా పునఃప్రారంభించడం సరికాదని తెలంగాణ వాదిస్తోంది. ఈ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల మేర నీటిని నిల్వ చేసే ప్రయత్నాల వల్ల తెలంగాణలోని భద్రాచలం, మణుగూరు వంటి కీలక ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కిన్నెరసాని, ముర్రేడు వాగుల పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఎకరాల భూమి నీట మునిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read : అర్ధరాత్రి హైడ్రామా.. అనుకున్నది సాధించిన చింతమనేని..!

దీనివల్ల వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రభుత్వం తన లేఖలో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముంపు ప్రాంతాలపై మొదట సమగ్రమైన జాయింట్ సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ సర్వే పూర్తి చేసి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టే వరకు ఎటువంటి నిర్మాణాలు సాగనివ్వకూడదని పీపీఏను కోరింది. ముఖ్యంగా గోదావరిలో కలిసే 36 వాగులపై బ్యాక్‌ వాటర్ ప్రభావంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం నొక్కి చెప్పింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

మార్కాపురం జిల్లాకు కూటమి...

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు...

జూలకంటిని ఇరికించాలని చూసిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా...

సోషల్ మీడియా సైకోలపై...

సోషల్ మీడియా వేదికగా మహిళలు, కుటుంబ...

విశాఖకు రెడ్ అలెర్ట్.....

విశాఖపట్నం దేశంలోని టైర్ టూ మెగా...

పోల్స్