Saturday, September 26, 2026 02:07 PM
Saturday, September 26, 2026 02:07 PM

బ్రేకింగ్: బిజేపికి షాక్ ఇచ్చిన అన్నాడిఎంకే..!

బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుండి తాము అధికారికంగా బయటకు వచ్చేసినట్లు సి.వి. షణ్ముగం ప్రకటించారు. ఇకపై బిజెపితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నా డీఎంకే సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని, అందుకే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు రెబల్ వర్గం ప్రకటించింది.

Also Read : అర్ధరాత్రి హైడ్రామా.. అనుకున్నది సాధించిన చింతమనేని..!

సుమారు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ మద్దతు అత్యంత కీలకం కానుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎడప్పాడి పళనిస్వామి ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకేతో చేతులు కలిపారని షణ్ముగం తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామి కుట్ర పన్నారని, ఇది పార్టీ మనుగడకే ప్రమాదకరమని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : మోదీ పొదుపు సలహాల వెనుక అసలు లెక్క ఇదే..!

పార్టీ వరుస ఓటములకు పళనిస్వామి ఏకపక్ష నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో అన్నా డీఎంకే వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి వెంటనే జనరల్ సెక్రటరీ పదవితో పాటు అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని షణ్ముగం, వేలుమణి డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్‌ ను పళనిస్వామి తోసిపుచ్చారు. దీంతో మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి సొంత దారి చూసుకోవాలని రెబల్ వర్గం నిర్ణయించుకుంది. ఈ రోజు స్పీకర్, డిప్యూటి స్పీకర్ ఎన్నిక తర్వాత, రెబల్ ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ను కలిసే అవకాశం కనపడుతోంది. నేడు తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్యేలతో విజయ్ బలం 150 మందికి పెరిగింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పోల్స్