Saturday, September 5, 2026 02:08 PM
Saturday, September 5, 2026 02:08 PM

సాయి రెడ్డి పార్టీకి ముహూర్తం ఫిక్స్.. అప్పుడే, అక్కడే..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన కూడా దీనిపై అధికారిక ప్రకటన చేసారు. ఇక ఆయన రాజకీయ వ్యూహాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, ఈ ప్రెస్ మీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read : తెలంగాణలో రేపే మంత్రివర్గ విస్తరణ..? రేసులో ఉన్న ఆ నలుగురు నేతలు వీళ్లే..!

విజయసాయిరెడ్డి తీసుకోబోయే నిర్ణయం అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన విజయవాడ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడలోని ప్రముఖ ‘లెమన్ ట్రీ ప్రీమియర్’ హోటల్‌లో మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఈ విలేకరుల సమావేశం జరగనుంది.

Also Read : పేపర్ మిల్లు మూసేస్తారా.. లేదా..?

ఈ సమావేశంలో తన ‘భవిష్యత్తు రాజకీయ విధానం’ మరియు రాబోయే రోజుల్లో తాను తీసుకోబోయే పొలిటికల్ స్టెప్స్ గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి చాలా కాలం పాటు.. వైఎస్ఆర్‌సీపీలో అత్యంత కీలక భూమికను పోషించిన సంగతి తెలిసిందే. నాయకత్వంతో విభేదాల నేపధ్యంలో.. ఆ పార్టీకి రాజకీయాలకు సాయి రెడ్డి గుడ్ బై చెప్పారు. అయితే ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే సస్పెన్స్ మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పార్టీ ప్రకటనతో పాటుగా జెండా, అజెండాను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పేపర్ మిల్లు మూసేస్తారా.....

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు వెంటనే...

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

నేను సీఎం అవుతా.....

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

పోల్స్