Saturday, July 25, 2026 08:02 PM
Saturday, July 25, 2026 08:02 PM

బ్రేకింగ్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై సిజిపి సుదీర్ఘంగా, రాజీలేని రీతిలో చేసిన పవర్‌ఫుల్ పోరాటానికి ఈ రాజీనామాతో చారిత్రాత్మక విజయం లభించింది.

Also Read : సీమకు మరో బంపర్ ఆఫర్..!

నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌ తో సిజిపి గత వారం రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉధృతమైన ధర్నా నిర్వహిస్తోంది. పార్టీ శ్రేణులు, విద్యార్థుల అండతో సాగిన ఈ నిరసనలు ఢిల్లీ పీఠాన్ని కదిలించడమే కాకుండా దేశం మొత్తాన్ని ఆలోచింపజేశాయి. నిరసనల తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, రెండు సార్లు సిజిపి ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదని సిజిపి గట్టిగా పట్టుబట్టింది.

Also Read : కోడలిపై జోగి రమేష్‌ కుటుంబం గృహహింస

ఈ ఉత్కంఠకు తెర దించుతూ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు సిజిపి గడువు విధించింది. ఆ డెడ్‌లైన్‌ ముగియడానికి ముందే, దేశవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. విద్యార్థుల పక్షాన నిలబడి సిజిపి సాధించిన ఈ అఖండ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యూక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర విద్యా శాఖలో పలువురు అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమెరికా గ్లోబల్ వీసా...

ప్రపంచంలో ఏ మూల కూర్చుని అమెరికా...

టీడీపీకి బోండా ఉమా...

ఏపీ రాజకీయాల్లో పసుపు జెండాను వీడి...

సీమకు మరో బంపర్...

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్...

కోడలిపై జోగి రమేష్‌...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

సీదిరి అప్పలరాజు రిమాండ్...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

పోల్స్