1996లో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర చుక్కలు చూపించారు. మరి ఇప్పుడు సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026లో వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డికి మంత్రి లోకేష్ చుక్కలు చూపించారా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కుటుంబానికి పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర చుక్కలు చూపించగా.. 30 ఏళ్ల తర్వాత.. అదే వైఎస్ కుటుంబానికి చుక్కలు చూపించిన ఘనత మాత్రం మంత్రి లోకేష్‌కే దక్కిందనే మాట బాగా వినిపిస్తోంది. 2021 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపించిన జగన్.. అంటూ వైసీపీ కరపత్రం సాక్షిలో తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబ కంచుకోట పులివెందులలో మంత్రి లోకేష్ రెట్టింపు చుక్కలు చూపించారనేది వాస్తవం.
Also Read : జగన్‌కు ఊహించని షాక్.. ఇలా తగులుకున్నా వేంట్రా..!
కుక్క గాటుకు చెప్పు దెబ్బ.. అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా.. అప్పుడు చంద్రబాబుని కుప్పంలో తెర వెనక నుంచి ఇబ్బందులు పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే జగన్‌కు రెట్టింపు చుక్కలు చూపించటమే కాదు.. కంటికి కునుకు రాకుండా చేయటంలో మంత్రి లోకేష్ గ్రాండ్ సక్సెస్ అయ్యారనేది వాస్తవం. తెర వెనక నుంచి టీడీపీ యంత్రాంగాన్ని నడిపించింది లోకేష్ మాత్రమే అనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి 50 ఏళ్ల నుండి కంచుకోటగా పులివెందుల పేరు. వైఎస్ కుటుంబ రాజకీయ కంచుకోటను చంద్రబాబు కూడా బద్దలు కొట్టలేక పోయారు. అలాంటి వైఎస్ కుటుంబ కంచుకోటను ఒక్క ఎన్నికతో కూల్చేశారు మంత్రి లోకేష్. అది కూడా పులివెందులలో కాలు పెట్టకుండా.. కనీసం ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పులివెందుల అనే మాటను లోకేష్ ఒక్కసారి కూడా పలకలేదు. అసలు ఎన్నికల గురించే మాట్లాడలేదు. కానీ.. వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులకు ఒక పథకం ప్రకారం చుక్కలు చూపించారు. రాజకీయ భయాన్ని సృష్టించారు.
Also Read : చీ.. ఇది కూడా రాజకీయమేనా.. మీరు మారరా..?
పులివెందుల టీడీపీ నాయకులందరినీ ఒక తాటి పైన నడిపించటమే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఏకగ్రీవం అయ్యేటట్లు చేసిన ఘనత కూడా లోకేష్‌కే దక్కుతుందనేది టీడీపీ సీనియర్ నేతల మాట. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఎక్కడా రిగ్గింగ్ జరగకుండా అప్పటి కడప జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్ర కట్టడి చేశారు. వైఎస్ రాజారెడ్డిని, ఆయన అనుచరులను కట్టడి చేయడంతో.. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా.. అప్పటి వరకు వేలకు వేలు మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్.. ఆ ఎన్నికలో మాత్రం కేవలం 5 వేల ఓట్లు మాత్రమే మెజారిటీ సాధించారు. ఒక దశలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. వైఎస్ఆర్ ఓడిపోయారని.. అయితే కొందరు అధికారులు తెర వెనుక నుంచి తోడ్పాటు అందించి.. గెలిచినట్లు ప్రకటించారనే ప్రచారం కూడా జరిగింది.
1996 ఎన్నికలను నిజాయితీగా నిర్వహించిన ఘనత ఉమేష్ చంద్రకే దక్కుతుంది. అందుకే కడప టీడీపీ నేతలతో పాటు ప్రజలు కూడా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు మంత్రి లోకేష్ వల్ల మళ్లీ ఓటు వేసే అవకాశం వచ్చిందనేది పులివెందుల ప్రజల మాట. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్‌కు పులివెందుల ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత తమ ఓటు తాము వేసుకునే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


