Thursday, May 28, 2026 09:06 PM
Thursday, May 28, 2026 09:06 PM

విరాళంలో వేమిరెడ్డి దంపతుల రికార్డ్..!

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు వేదికగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు పార్టీ బలోపేతం కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నిధికి తమ వంతు సహాయంగా ఏకంగా రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని వేమిరెడ్డి దంపతులు అందజేశారు. మహానాడు సభ జరుగుతుండగా వేమిరెడ్డి దంపతులు ఈ విరాళానికి సంబంధించిన చెక్కును పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి నేరుగా వేదికపైనే అందజేశారు.

Also Read : మహానాడులో చారిత్రాత్మక ఘట్టం.. తొలిసారి ట్రాన్స్‌ జెండర్ స్పీచ్..!

పార్టీపై ఉన్న నమ్మకంతో ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన వేమిరెడ్డి దంపతులను సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీకి అండగా నిలవడంలో వేమిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇచ్చిన ఈ భారీ విరాళంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వేమిరెడ్డి కుటుంబంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అనుబంధ కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు వేమిరెడ్డి దంపతులు ఎల్లప్పుడూ ముందుంటారని, ఈ విరాళంతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని తెలుగు తమ్ముళ్లు పండుగ చేసుకుంటున్నారు. కాగా, గత ఏడాది కడపలో జరిగిన మహానాడు వేడుకల్లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకంగా రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని అందజేసి అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగిస్తూ మళ్లీ రూ. 5 కోట్లు అందజేయడం గమనార్హం.

Also Read : మోదీ సర్కార్‌కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!

ఇదే వేదికపై టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సైతం పార్టీ బలోపేతానికి తమ వంతుగా రూ. 1.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి చెక్కును అందజేశారు. మహానాడు వేదికపై చంద్రబాబు నాయుడు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, సానా సతీష్ బాబు గత ఏడాది కడపలో జరిగిన మహానాడు వేడుకల్లో కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు, క్యాడర్ సంక్షేమానికి అండగా నిలుస్తూ భారీ విరాళాన్ని అందజేసి తన పార్టీ విధేయతను చాటుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కష్టపడిన వారికి గుర్తింపు...

వైసీపీ ఐదేళ్ల పాలనలో చాలా మంది...

అధికారం కోసం విధ్వంసం.....

బాల్క సుమన్.. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్...

ఏపీ మైనింగ్ కుంభకోణంపై...

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా...

2029 ఎన్నికల పై...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో...

మోదీ సర్కార్‌కు పుష్కరం.....

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో...

మన టార్గెట్.. జెన్...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

పోల్స్