Wednesday, September 30, 2026 01:26 PM
Wednesday, September 30, 2026 01:26 PM

వాహనదారులకు సుప్రీం షాక్.. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే..?

దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల ట్రాఫిక్ ఈ చలాన్ల వసూళ్లపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక సంచలన, వినూత్నమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, చలానాలు కట్టకుండా నిర్లక్ష్యం వహించే వాహనదారుల నుంచి పెనాల్టీలను వసూలు చేయడానికి.. ఆ బకాయిలను నేరుగా వారి నెలవారీ కరెంట్ బిల్లులకు లింక్ చేయాలని ధర్మాసనం సూచించింది.

Also Read : ఒక్క మ్యాచ్ తో కోహ్లీ రేర్ రికార్డులు..!

రోడ్డు భద్రత మరియు ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ నిబంధనల అమలుపై సామాజిక కార్యకర్త ఎస్. రాజశేఖరన్ 2012లో దాఖలు చేసిన ఒక సుదీర్ఘ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ జె.బి. పార్ధివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ పిటిషన్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా, దేశంలో పేరుకుపోయిన చలానాల తాలుకూ అధికారిక గణాంకాలను చూసి కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు రూ. 45,000 కోట్ల విలువైన ఈ చలాన్లు జారీ అవ్వగా, అందులో కేవలం రూ. 25,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, ఇంకా రూ. 20,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి వచ్చింది. కేవలం లక్షల సంఖ్యలో చలానాలు విధిస్తే సరిపోదని, వాటిని వసూలు చేసేందుకు క్షేత్రస్థాయి యదార్థాలను బట్టి అధికారులు కఠినమైన మార్గాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. “జనాలు ట్రాఫిక్ చలానాలు కట్టకపోతే, ఆ మొత్తాన్ని వారి విద్యుత్ బిల్లుల బకాయిల్లో కలిపేయండి. ఎలాగూ కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు కాబట్టి, ఆ భయంతోనైనా చలానాలు చెల్లిస్తారు. ఈ దేశంలో రికవరీ కోసం ఇలాంటి సరికొత్త దారులనే వెతకాలి” అని జస్టిస్ పార్ధివాలా వ్యాఖ్యానించారు.

Also Read : వైసీపీ టూ జనసేన.. ఎవరికి లాభం..?

అయితే, ఇది కోర్టు విచారణలో భాగంగా చేసిన ఒక ప్రతిపాదన, సూచన మాత్రమేనని, ఇంకా ఎలాంటి తుది అమలు ఉత్తర్వులు జారీ చేయలేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల లింకేజ్‌తో పాటు, చలానాలు కట్టని డిఫాల్టర్ల వాహనాలకు సంబంధించి మరికొన్ని కఠిన చర్యలను కూడా ధర్మాసనం చర్చించింది. పెండింగ్ చలానాలు ఉన్న వాహనాల ఆర్‌సీ రెన్యువల్ ఆపడం, యాజమాన్య బదిలీలు నిలిపివేయడం, ఫిట్‌నెస్ మరియు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లను బ్లాక్ చేయడం వంటి ఆంక్షలు పెట్టాలని సూచించింది. అలాగే, నిబంధనలు పదే పదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేలా రవాణా శాఖ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాపులపై ప్రేమ కాదు,...

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది....

ఏపీ మద్యం స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ హయాం...

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు...

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పోల్స్