Wednesday, September 30, 2026 01:01 PM
Wednesday, September 30, 2026 01:01 PM

అమెరికా వెళ్లే భారతీయులకు భారీ షాక్..!

అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అత్యంత వేగంగా గ్రీన్‌కార్డ్ పొందాలనుకునే అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా భారతీయ పారిశ్రామికవేత్తలకు అమెరికా సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రవాస పెట్టుబడిదారుల కోసం కేటాయించిన అత్యంత ప్రజాదరణ పొందిన ‘EB-5 వీసా’ దరఖాస్తు ఫీజులను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుతూ అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన కొత్త ఫీజుల నిబంధనలు ఈ ఏడాది నవంబర్ 30 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి.

Also Read : ప్రపంచ దేశాలకు జైశంకర్ వార్నింగ్.. అమెరికా తీరుపై భారత్ తీవ్ర అసంతృప్తి..!

అమెరికా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో లేదా వ్యాపారాల్లో కనీసం 8 లక్షల డాలర్ల నుండి 1.05 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి, 10 మంది స్థానికులకు పూర్తికాల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఈ EB-5 గ్రీన్‌కార్డ్ పొందవచ్చు. ఐటీ నిపుణులు, సంపన్న వ్యాపారవేత్తలతో కూడిన భారతీయ వర్గాల్లో ఈ వీసాకు గత దశాబ్ద కాలంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే, ఇప్పుడు దరఖాస్తు రుసుములు భారీగా పెరగడంతో, అమెరికాలో స్థిరపడాలనే కలలతో ఉన్న భారతీయ ఇన్వెస్టర్లపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Also Read : వైసీపీ టూ జనసేన.. ఎవరికి లాభం..?

USCIS ప్రకటించిన తాజా నివేదిక ప్రకారం, ఇన్వెస్టర్లు సమర్పించే వివిధ దరఖాస్తు ఫారాల ఫీజులు భారీగా పెరిగాయి. స్టాండ్‌అలోన్ ఇన్వెస్టర్లు దాఖలు చేసే ఫామ్ I-526 ఫీజును ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుండి నేరుగా 7,615 డాలర్లకు అంటే దాదాపు 107 శాతం పెంచారు. అలాగే రీజినల్ సెంటర్ల ద్వారా వచ్చే ఇన్వెస్టర్లు సమర్పించే ఫామ్ I-526E ఫీజును ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుండి 7,850 డాలర్లకు అంటే దాదాపు 114% పెంచారు. గ్రీన్‌కార్డ్ నిబంధనల తొలగింపు కోసం వేసే ఫామ్ I-829 ఫీజును 3,750 డాలర్ల నుండి 5,000 డాలర్లకు పెంచగా, దీనికి తోడు అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజును కూడా కొత్తగా చేర్చారు. నవంబర్ 30 లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి పాత ఫీజులే వర్తిస్తాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. అందువల్ల అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ గడువు ముగిసేలోపే తమ దరఖాస్తులను సమర్పించుకుంటే వేల డాలర్ల అదనపు భారం నుండి తప్పించుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాపులపై ప్రేమ కాదు,...

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది....

ఏపీ మద్యం స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ హయాం...

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు...

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పోల్స్