ఢిల్లీ ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్‌పైన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు, కంటి సంబంధిత బయోమెట్రిక్ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్ పెట్టవచ్చని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పరిశీలించిన భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిన్ సూర్య కాంత, జస్టిస్ జే బాగ్బీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్ పైన స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.
Also Read : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్..!
అదే సమయంలో.. బయోమెట్రిక్ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సీజే బెంచ్ తోసిపుచ్చింది. అది సాధ్యమయ్యే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.
అడ్వొకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన ఈ పిటిషన్ లో.. ఒక ఓటర్ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నామని.. డూప్లికేట్ ఓటింగ్, గోస్ట్ ఓటింగ్.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి పోలింగ్ బూత్ల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ అమలు చేయాలని పేర్కొన్నారు.
Also Read : వైసీపీ రాజకీయ పార్టీనా.. ఉగ్రవాద సంస్థనా?
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజే బెంచ్ ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్ అవసరమా? అని ప్రశ్నించింది. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేని కంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్ ఎలక్షన్స్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలను కోవడం విశేషం.

