భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్న మార్పులు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. 2019 నుంచి కొన్ని కీలక మార్పులతో బోర్డు పెద్దలు షాక్ కు గురి చేస్తున్నారు. తాజాగా బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు మరో ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నా సరే బిన్నీ రాజీనామా చేశారు. దీని వెనుక కారణాలేంటి అనేదానిపై స్పష్టత లేకపోయినా తదుపరి బోర్డు అధ్యక్షుడు ఎవరు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Also Read : ఆస్ట్రేలియా టూర్ కు జట్టు ఇదేనా..?వైస్ కెప్టన్ గా అతనే..!
ప్రస్తుత వార్తల ప్రకారం దక్షిణాదికి చెందిన మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం కనబడుతోంది. టీమిండియా మాజీ కోచ్.. అనిల్ కుంబ్లే పేరును బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐసీసీలో కూడా పనిచేసిన అనుభవం అనిల్ కుంబ్లేకి ఉంది. టీమిండియా కోచ్ గా కూడా మూడేళ్ల పాటు కుంబ్లే పనిచేశాడు. అతనితోపాటుగా మరో మాజీ క్రికెటర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దిలీప్ వెంగ్ సర్కార్ లేదా సందీప్ పాటిల్ పేర్లను బోర్డు పరిశీలిస్తుంది.
Also Read : ఇండియా టుడే బీహార్ మూడ్ చేంజ్ చేస్తుందా..?
విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఈసారి బోర్డు అధ్యక్షుడు ఎంపిక ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల కొనసాగుతున్నారు. బిన్నీ రాజీనామా చేసిన అంశాన్ని బోర్డు హైలెట్ చేయలేదు. దీని గురించి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ప్రచారం లేదు. మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా.. అంతర్గత కారణాలతోనే దీని గురించి హడావుడి చేయలేదని తెలుస్తోంది.

