Sunday, September 20, 2026 05:04 AM
Sunday, September 20, 2026 05:04 AM

ఫ్యాన్స్ కు జక్కన్న షాక్.. అవన్నీ ఫేక్ అంటూ వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. ఒక్కో న్యూస్ తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ శివారుల్లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించబోయే సినిమాకు సంబంధించి మొదటి ఈవెంట్ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. ఈ ఈవెంట్ లోనే సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పటికే సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించి వారి వారి పేర్లు అనౌన్స్ చేశారు.

Also Read : నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పాత్ర పై పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇలా ఒక్కొక్కటిగా సినిమాకు సంబంధించి హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. ఈ టైంలో సినిమా డైరెక్టర్ రాజమౌళి వీడియో రిలీజ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించబోయే ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ అని ప్రచారం జరుగుతోందని.. కానీ పాస్ లో ఉన్న వారికి మాత్రమే ఆ ఈవెంట్ అంటూ ప్రకటించారు. ఆన్లైన్ లో పాసులు అమ్ముతున్నారని మాట వాస్తవం కాదని.. అటువంటి రూమర్స్ నమ్మవద్దని ఫ్యాన్స్ ను కోరారు. ఈ భారీ ఈవెంట్ కు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేశారు రాజమౌళి.

Also Read : విశాఖలో ఐటి కంపెనీల జాతర

విజయవాడ వైపు నుంచి వచ్చేవారు ఎలా రావాలో, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు ఏ విధంగా రావాలో రాజమౌళి వివరించారు. ఉన్న అన్ని మార్గాలకు సంబంధించి వీడియోలను పొందుపరిచి.. అందుకు సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ పాస్ పై ఇచ్చామని.. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈవెంట్ విషయంలో జరిగే ప్రచారాలను నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఈవెంట్ జరిగే రోజు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు రాజమౌళి. ఇక ఈవెంట్ లో సినిమా టైటిల్ తో పాటుగా వీడియో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్