Sunday, June 21, 2026 08:20 PM
Sunday, June 21, 2026 08:20 PM

మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?

భారత క్రికెట్లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ ఏడాది కీలక ఆటగాళ్లు రిటైర్ కాగా త్వరలోనే మరో ఆటగాడు కూడా రిటైర్ అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ విషయంలో కూడా గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అటు సెలక్షన్ కమిటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండటంతో గంభీర్ ఇప్పుడు జట్టులో మరిన్ని మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : గోదావరి వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్..!

ఇదే సమయంలో యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్.. ఇటీవల రవీంద్ర జడేజాతో చర్చించినట్లు సమాచారం. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో కీలక పర్యటనలు ఉన్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుంటుందని.. కాబట్టి రిటైర్మెంట్ ఆలోచన చేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ వరకు వైట్ బాల్ క్రికెట్ ఆడాలని.. కానీ సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ తర్వాత టెస్టులకు గుడ్ బై చెప్పాలని గంభీర్ కోరినట్లు సమాచారం.

Also Read : నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

దీనిపై జడేజా కూడా అంతే సానుకూలంగా స్పందించినట్లు టీమిండియా వర్గాలు అంటున్నాయి. సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ తర్వాత జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై తన సన్నిహితులతో కూడా అతను చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత జట్టు పూర్తి కసరత్తు చేస్తుంది. దాదాపు దశాబ్ద కాలంగా స్పిన్ విభాగంలో అత్యంత కీలకంగా ఉన్న జడేజా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మైదానాల్లో బ్యాటింగ్ లో కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీనితోనే అత్యుత్తమ ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు జడ్డు భాయ్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత జడేజా కొనసాగడం పై విమర్శలు కూడా వచ్చాయి. దీనితోనే గంభీర్ కాస్త కఠినంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్