Sunday, September 20, 2026 04:57 AM
Sunday, September 20, 2026 04:57 AM

తులసిబాబు విషయంలో రఘురామ సంచలన వ్యాఖ్యలు..!

తనను కస్టడీలో టార్చర్ చేసిన వ్యవహారంలో ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఎలాగైనా సరే ఈ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయించిన రఘురామ ఇప్పుడు.. తులసి బాబు విషయంలో సీరియస్ గా వ్యవహరించడం ఆసక్తిని రేపుతోంది. తనను హింసించడంలో అతను కీలక పాత్ర పోషించడంతో రఘురామ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా తులసిబాబు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : బన్నీ కోసం సల్మాన్ ను పక్కన పెట్టేసాడా…?

కస్టోడియల్ టార్చర్ కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడం కోసం కోర్టుకు వచ్చిన రఘురామ.. తులసీ బాబు లాయర్ గా నమోదు చేసుకోలేదని.. న్యాయ సలహా కింద తులసీ బాబు కు గత ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. లాయర్ గా నమోదు కాకుండానే ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుంది అని ఆయన ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు. ఐపిఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారు‌ అని నిలదీశారు.

Also Read : సోమవారం టెస్ట్ పాస్ అయిన తండేల్.. అంచనాలకు మించి కలెక్షన్లు

ఐపిఎస్ అధికారిగా ఉంటూ స్వచ్చంధ సంస్థను సునీల్ కుమార్ ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించారు రఘురామ. సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీ రావాలని కోరుతున్నానన్నారు. జగన్ 2.0 వ్యాఖ్యలు ఉనికి కోసమే అన్నారు డిప్యూటి స్పీకర్. కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు బెయిల్ లభించింది. విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఏ4 నిందితుడిగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్