Wednesday, August 5, 2026 11:21 AM
Wednesday, August 5, 2026 11:21 AM

ఇండియాలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక..!

బాజీరావు మస్తానీ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఎక్కువగా హాలీవుడ్ పై ఫోకస్ పెడుతూ వస్తుంది. హాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈమె.. అక్కడి స్టార్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్న ఈ అమ్మాయి ప్రస్తుతం మహేష్ బాబుతో తెలుగులో సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?

దాదాపు 30 కోట్లు అందుకు ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక ప్రియాంక చోప్రా ఇప్పుడు పూర్తిగా ఇండియాను వదిలేసే ఆలోచనలో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. వరుసగా తనకు ముంబైలో ఉన్న ఆస్తులను అమ్మేయడం ఈ మధ్య కాస్త సెన్సేషన్ అయింది. తాజాగా వెస్ట్ ముంబై.. అందేరీలో ఉన్న తన ఆస్తులను అమ్మేసింది ప్రియాంక చోప్రా. ఒబెరాయ్ స్కై గార్డెన్స్ లో ఆమెకు విలాసవంతమైన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని 16.17 కోట్లకు ఆమె విక్రయించింది. ఇటీవల కూడా ఆమె ముంబైలో రెండు ఫ్లాట్లను అమ్మేసింది.

Also Read : భువనేశ్వరి అంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో..!

ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్ జోనస్.. కుమార్తె మేరీ చోప్రా తో కలిసి లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఇక సినిమాలకు పూర్తిగా దూరమై.. అమెరికాలో జీవితం గడపాలని ప్రియాంక చోప్రా భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే ఇండియాలో ఉన్న తన ఆస్తులను అమ్మేస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో.. ఈమె సినిమా చేస్తోంది. ఆ తర్వాత బాలీవుడ్లో రెండు సినిమాలకు సైన్ చేసింది. లేటు వయసులో కూడా బిజీ బిజీగా గడుపుతున్న.. ఈ స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్