Thursday, May 7, 2026 03:24 AM
Thursday, May 7, 2026 03:24 AM

పాపం.. వైసీపీకి మరో షాక్ ట్రీట్‌మెంట్..!

వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నేనే రాజు… నేనే మంత్రి… నేను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చివరికి ఎన్నికల సమయంలో తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయించారు. ఇంకా చెప్పాలంటే… ఇష్టారీతిన అభ్యర్థులను ఎంపిక చేశారు తప్ప… స్థానిక నేతల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీ… 164 చోట్ల ఓడిపోయింది. కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రాలేదు. దీంతో పార్టీకి కీలక నేతలంతా దూరమవుతున్నారు.

Also Read : గతం మర్చిపోయి పరువు పోగొట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కారణాలపై ప్రతి ఒక్కరు విశ్లేషించుకున్నారు. ప్రధానంగా పార్టీ అధినేత ఒంటెద్దు పొకడలతో పాటు నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల తీరు వల్లే తామంతా ఓడినట్లు గుర్తించారు. దీంతో జగన్ వెంటే ఉంటే… రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు ఉండదని గుర్తించారు. నెమ్మదిగా వైసీపీలో తమ దుకాణం సర్దేస్తున్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నానితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్‌కు షాక్ ఇచ్చారు. చివరికి విజయసాయిరెడ్డి వంటి అత్యంత ఆప్తుడు కూడా జగన్‌తో ఉంటే కష్టాలు తప్పవని గ్రహించి… ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో మాజీ కూడా జగన్‌కు షాక్ ఇచ్చారు.

Also Read : సీఎం పర్యటన… ఆ ప్రాంత వాసుల కల నెరవేరేనా..?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జగన్‌కు షాక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న పార్టీ ప్లీనరీ సభలో అధికారికంగా చేరనున్నారు. వాస్తవంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ పరిస్థితుల కారణంగా మిత్రులు కూడా శత్రువులుగా కూడా మారిపోతారు. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యే వర్మ పేరు ఎత్తగానే విరుచుకుపడే పెండం దొరబాబు ఇప్పుడు జనసేన గూటికి చేరడంతో శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోయినట్లు అయ్యింది. దొరబాబుతో పాటు కుమార్తె, అల్లుడు కూడా పవన్ కల్యాణ్‌ను కలిశారు. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం టికెట్ ఆశించిన దొరబాబును జగన్ పక్కన పెట్టారు. పవన్ కల్యాణ్‌పై వంగా గీతను పోటీలో పెట్టారు. దీంతో దొరబాబును జగన్ బుజ్జగించారు. అయితే వైసీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుండటంతో దొరబాబు కూడా ఇప్పుడు దుకాణం సర్దేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్