Sunday, June 21, 2026 09:49 AM
Sunday, June 21, 2026 09:49 AM

జగన్ హెలికాప్టర్ దిగకుండా తిప్పి పంపుతా: పరిటాల సునీత

గత నెల రోజుల నుంచి వైసీపీ తమను టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రంగంలోకి దిగారు. వైసీపీ నేతలకు, ఆ పార్టీ అధిష్టానానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సునీత. జగన్ పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ను అనంతపురం రాకుండా అడ్డుకునే దమ్ము ధైర్యం రెండూ ఉన్నాయి అంటూ మాట్లాడిన ఆమె.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి ఉంది అని హెచ్చరించారు.

Also Read : కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?

మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారని అన్నారు సునీత. కానీ మాకు చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని వ్యాఖ్యానించారు. గతంలో పరిటాల రవి.. పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారు అని గుర్తు చేసారు. వాహనాలు తనిఖీ చేసి.. 3వాహనాలకే అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు అంటూ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరారు.

Also Read : హమ్మయ్య.. మిథున్ రెడ్డి సేఫ్..!

ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడు అని సునీత మండిపడ్డారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. రాప్తాడు ఇన్ ఛార్జి బీసీకి ఇవ్వాలి అని డిమాండ్ చేసారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు.. ఎవరూ సహనం కోల్పోవద్దు అని సూచించారు. జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా వచ్చిన పని చూసుకుని వెళ్తే బాగుంటుంది అన్నారు సునీత. రాజకీయాల్లో విలువలు అనే మాట వైసీపీ వర్తించదు అని.. ఆ పార్టీ నాయకులు ఆ మాట మాట్లాడకూడదు అన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్