Wednesday, August 5, 2026 12:58 PM
Wednesday, August 5, 2026 12:58 PM

దొరకని కసిరెడ్డి.. మళ్ళీ విజయసాయి రెడ్డికి షాక్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నకిలీ మద్యం బ్రాండ్లతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అని ఆరోపణలు వినిపించాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి ప్రతిపక్ష పాత్రలో మద్యం కుంభకోణం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎవరిని అదుపులోకి తీసుకోకపోయినా కొంతమందిని మాత్రం విచారించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!

అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఐటి సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్న సమయంలో కూడా కసిరెడ్డి వ్యవహారాన్ని బయటకు తీశారు. ఇక ఆయనను విచారించడానికి సిఐడి అధికారులు పలుమార్లు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దాదాపు నాలుగు సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చిన సరే ఇప్పటివరకు సిట్ అధికారులకు గానీ, సిఐడి అధికారులకు కానీ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్లోని కసిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు కూడా నిర్వహించింది. హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల పై సిట్ బృందాలు సోదాలు చేశాయి. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు లిక్కర్ స్కాం పై సిట్ విచారణ చేస్తున్నాయి.

Also Read : పవన్ ఇంటికి బన్నీ.. అంతా సెట్ అయిందా..?

ఇక తాజాగా మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గా కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈనెల 18న విజయవాడలోని సిఐడి కార్యాలయంలో రెండో అంతస్తులు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా అనేదే ప్రధాన ప్రశ్న. ఇటీవల కూడా ఇదే వ్యవహారంలో ఆయనను ఒకసారి అధికారులు విచారించారు. ఆ సమయంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును ఆయన బయటపెట్టారు. దీంతో మళ్లీ ఎవరి పేరును విజయసాయిరెడ్డి బయటపెట్టే అవకాశం ఉండవచ్చు అనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్