Saturday, August 8, 2026 04:55 PM
Saturday, August 8, 2026 04:55 PM

వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!

చేసినవి రెండు సినిమాలే అయినా.. యువ నటుడు తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాడు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు మిరాయ్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. అదిరిపోయే ఓపెనింగ్స్ తో 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read : భోగాపురంలో ఫస్ట్ విమానం ఎప్పుడో తెలుసా..?

ఇండియాలో 50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. వీకెండ్ లో రిలీజ్ కావడం, న్యూట్రల్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు కలిసి వచ్చింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. ఇండియాలో మొత్తం రూ 57.50 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేకపోయినా తేజా సజ్జా సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయడంతో పాటుగా దీనికి మరో సినిమా పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

Also Read : ఐటీ రిటర్న్ కు నేడే లాస్ట్ డేట్.. జరిమానా ఎంతంటే..!

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో అమెరికాలో ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మన కరెన్సీలో 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా ప్రకారం ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ లో 25 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్ ఎండ్ లో మొత్తం 83 కోట్లు వసూలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డం సినిమా కేవలం 82.05 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. మంగళవారం నాటికి ఈ సినిమా వంద కోట్లు సాధించడం ఖాయంగా కనపడుతోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే హరిహర వీరమల్లు, తండేల్ సినిమా కలెక్షన్స్ కూడా బీట్ చేయడం ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

పోల్స్