Wednesday, August 5, 2026 07:15 AM
Wednesday, August 5, 2026 07:15 AM

భారత్ కు మరో కంట్రీ షాక్..!

రష్యాతో స్నేహం చేస్తోందనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. విధించిన సుంకాల విషయంలో భారత ప్రభుత్వం ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటికే అమెరికా దారిలోకి వస్తోన్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాతో స్నేహం చేసే దేశాలు సైతం భారత్ విషయంలో అనుసరిస్తోన్న వైఖరి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మెక్సికో కూడా భారత్ కు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వార్తలు ఇప్పుడు భారత్ లో ఆందోళన పెంచుతున్నాయి.

Also Read : నలుగురు మంత్రులపై సీఎం సీరియస్..?

భారత దిగుమతులపై అమెరికా 50% సుంకాలను అమాంతం పెంచిన తర్వాత , ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో మరో దేశం భారత్ కు వ్యతిరేకంగా కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టినట్టు జాతీయ మీడియా పేర్కొంది. బుధవారం, మెక్సికో సెనేట్ భారతదేశం, చైనా, సహా ఇతర ఆసియా దేశాల నుండి వచ్చే వివిధ రకాల దిగుమతులపై 50% వరకు సుంకాలను ఆమోదించిందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ట్రంప్ ను సంతోష పెట్టడానికే మెక్సికో ఈ నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియా పేర్కొంది.

Also Read : పార్లమెంట్ ను కుదిపేసిన ఈ సిగరెట్..!

జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చే ఈ సుంకాల పెంపుదల వల్ల మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుండి వచ్చే ఆటో మొబైల్ ఉత్పత్తులు, ఆటోలు, ఆటో మొబైల్ విడిభాగాలు, వస్త్రాలు, ప్లాస్టిక్‌, ఉక్కు వంటి వస్తువులపై 50% వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. దీనితో భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్ మరియు ఇండోనేషియా వంటి దేశాలు ప్రభావితమవుతాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ దేశీయ ఉత్పత్తిని పెంచాలని చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని రాయిటర్స్ వెల్లడించింది. అయితే, అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందంపై అమెరికా సమీక్షకు ముందు ట్రంప్‌ను సంతృప్తి పరచడానికి ఈ నిర్ణయంగా భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్