Sunday, June 21, 2026 02:29 AM
Sunday, June 21, 2026 02:29 AM

రెండు పార్టులుగా మహేష్ సినిమా.. షాక్ ఇచ్చిన జక్కన్న

టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియన్ సినిమాకు ట్రెండ్ సెట్టర్ దర్శక ధీరుడు రాజమౌళి. సినిమాలను కమర్షియల్ గా ఏ రేంజ్ లో ప్లాన్ చేయాలో జక్కన్నకు ప్రతీ అంశంలోనూ ఓ అవగాహన ఉంటుంది. అందుకే బాహుబలి సినిమాను రెండు పార్ట్ లు చేసి కథ లేకపోయినా ఎలివేషన్ తో వందల కోట్ల వసూళ్లు సాధించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం ఒక్కటే సినిమాతో వదిలిపెట్టాడు. ఇక బాహుబలి సినిమా నుంచి స్టార్ హీరోల సినిమాలు అన్నీ రెండు పార్ట్ ల మంత్రం ఎంచుకున్నాయి. కథలో పట్టు లేకపోయినా రెండు పార్ట్ ల హడావుడి ఎక్కువగా జరుగుతోంది.

కేజిఎఫ్, పుష్ప, సలార్, యానిమల్, దేవర ఇలా దాదాపుగా స్టార్ హీరోల సినిమాలు అన్నీ రెండు పార్ట్ లతో ఇప్పుడు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసి క్లైమాక్స్ సస్పెన్స్ తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. పుష్ప 2 పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. హీరో విలన్ మధ్య పోరు ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది జనాల్లో ఓ రేంజ్ ఆసక్తి ఉంది. ఇక ఇప్పుడు జక్కన్న… తాను మహేష్ బాబుతో చేయబోయే సినిమాను కూడా రెండు పార్ట్ లు ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read : సల్మాన్ కు ప్రాణహాని.. అయినా క్షమాపణ ఎందుకు చెప్పడం లేదు..?

ఇప్పటి వరకు అందరూ ఒక పార్ట్ అనుకున్నా… అది రెండు పార్ట్ లు అని, కథ పెద్దగా ఉండటంతో కచ్చితంగా సీక్వెల్ ఉండాలని జక్కన్నతో పాటుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ భావిస్తున్నారట. జనవరి 25 నుంచి మొదటి పార్ట్ షూటింగ్ మొదలుపెట్టి 2026 చివర్లో విడుదల చేసి… మరో ఏడాది తర్వాత పార్ట్ 2 విడుదల చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి. గత అయిదేళ్ళ నుంచి సరైన హిట్ లేక సతమవుతున్న మహేష్ బాబు మరో అయిదేళ్ళు లాక్ అయిపోవాల్సిందే. జక్కన్న కాబట్టి ఈ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సూపర్ స్టార్. మరి జక్కన్న ప్లాన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్