Wednesday, August 5, 2026 12:13 PM
Wednesday, August 5, 2026 12:13 PM

జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!

దేశ వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మధ్య తరగతికి పలు ధరలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వాహనాలు, మందులు, సిమెంట్ సహా పలు ధరలు తగ్గాయి. దీనితో ఈ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ సంస్కరణల ప్రభావం కూడా భారీగా కనపడుతోంది. దీనిపై ఏపీ రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. వాహనాల కొనుగోళ్ళు ఏ స్థాయిలో పెరిగాయో ఆయన వివరించారు.

Also Read : వైసీపీ కోసం పని చేస్తున్న చంద్రబాబు..!

జీఎస్టీ ప్రభావంతో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయని తెలిపారు. కొత్త పన్ను విధానం ప్రజలకు ఊరట ఇచ్చిందని, దీనితో రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని ఆయన వివరించారు. మంత్రి వివరాల ప్రకారం, సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరిగాయని పేర్కొన్నారు. భారీ వాహనాల నుంచి ఆటోల వరకు భారీ అమ్మకాలు జరిగాయని వివరించారు.

Also Read : ఎక్కడ దాక్కున్నా వదలను.. జగన్ సంచలన కామెంట్స్

వీటిలో మోటార్ సైకిళ్లు 2,352, కార్లు/క్యాబ్‌లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నట్టు తెలిపారు. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని వివరించారు. త్వరలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని వెల్లడించారు. అటు సిమెంట్ ధరలు భారీగా తగ్గడంతో నిర్మాణ రంగం కూడా ఊపు అందుకునే సంకేతాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్