Thursday, September 17, 2026 08:51 PM
Thursday, September 17, 2026 08:51 PM

పుట్టిన పిల్లలకు ఎన్ని రోజులు షుగర్ పెట్టకూడదు..?

పంచదారతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనే మాట వాస్తవం. అందుకే షుగర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. మన దేశంలో ఏటా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ కు షుగర్ కారణంగా మారుతున్న మాట వాస్తవం. అందుకే వైద్య నిపుణులు తాజాగా కీలక హెచ్చరికలు చేసారు. పుట్టిన పిల్లలకు వెయ్యి రోజుల లోపు షుగర్ పెట్టకుండా ఉండటం మంచిదని, అలా చేస్తే వారికి భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులను కట్టడి చేయవచ్చని తెలిపారు.

Also Read : నా భర్తను పరిచయం చేస్తున్నా: రష్మిక

ది బీఎంజేలో ప్రచురితమైన ఇటీవలి కథనంలో సంచలన విషయాలను ప్రస్తావించారు. బాల్యంలో తక్కువ చక్కెర తినేవారికి పెరిగి పెద్దయ్యాక, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని వెల్లడించారు. హృదయ సంబంధ వ్యాధులు, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, గుండె వైఫల్యం, స్ట్రోక్ కారణంగా మరణాలు వంటివి ఉన్నాయి. 1953లో యునైటెడ్ కింగ్‌డమ్‌ లో రేషన్ లో షుగర్ ను తొలగించిన నాటి నుంచి ఈ డేటా తీసుకున్నారు. యూకేలో చక్కెర రేషన్‌ ను 1953 సెప్టెంబర్ లో నిలిపివేశారు.

అందుకే జీవితం ప్రారంభ రోజుల్లో చక్కెరను పరిమితం చేయడంతో.. భవిష్యత్తులో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశంపై పరిశోధనకు అవకాశం దొరికింది. రేషన్ కాలంలో, గర్భిణీ స్త్రీలు, పిల్లలు సహా మొత్తం జనాభాకు చక్కెరను రోజుకు 40 గ్రాముల కంటే తక్కువకు పరిమితం చేశారు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు అదనంగా చక్కర ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ అధ్యయనంలో యూకే బయోబ్యాంక్ నుండి 63,433 మంది పాల్గొన్నారు. వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు.

Also Read : టార్గెట్ జనసేనాని అంటున్న బొలిశెట్టి..!

ఇందులో పాల్గొనేవారు అక్టోబర్ 1951, మార్చి 1956 మధ్య జన్మించారు. వీరికి గుండె జబ్బుల చరిత్ర లేదు . 40,063 మంది జీవితంలో ప్రారంభంలోనే షుగర్ తీసుకున్నారని, 23,370 మంది షుగర్ తీసుకోలేదని గుర్తించారు. సుమారు 2 సంవత్సరాల వయస్సు వరకు చక్కెర తినడం పరిమితం చేసిన వారిలో గుండె జబ్బులు రావడంలో ఆలస్యం కావడం గుర్తించారు. జీవితంలోని మొదటి 1000 రోజులు.. గర్భధారణ నుండి దాదాపు 2 సంవత్సరాల వయస్సు వరకు పోషకాహార పరంగా దీర్ఘకాలిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు అంటున్నారు. చక్కెర తిన్నవారిలో కొంత ప్రమాదకరంగా ఆరోగ్యం ఉందని, యుక్తవయస్సులో హృదయ సంబంధ ప్రమాదాలు తలెత్తాయని గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్