Friday, May 1, 2026 08:02 AM
Friday, May 1, 2026 08:02 AM

ఇజ్రాయిల్ ప్రధాని ఎక్కడ..? అది డీప్ ఫేక్ వీడియో..?

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహు ఎక్కడ..? ఇప్పుడు ఈ ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇరాన్ బలగాలు జరిపిన దాడిలో ఆయన మరణించారు అనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో కనిపించే కొన్ని అసాధారణ దృశ్యాలు ఆయన మృతి చెందారనే పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అసలు ఆ వీడియోలో ఏముంది? నెటిజన్ల అనుమానాలు ఏంటి? అనే అంశాలు ఒకసారి చూస్తే..

Also Read : కోహ్లీ, రోహిత్ ఫిట్.. గంభీర్ కు ఎన్సీఏ క్లారిటీ..!

సాధారణంగా మనుషులకు ఐదు వేళ్లు ఉంటాయి, నెతన్యాహుకు కూడా అంతే. కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు, ఇది నిజమైన నెతన్యాహు కాదు, డీప్‌ఫేక్ వీడియో అని వాదిస్తున్నారు. సాధారణంగా ఏఐ చిత్రాలు లేదా వీడియోలను సృష్టించేటప్పుడు వేళ్లను ఖచ్చితంగా చూపడంలో తరచుగా పొరపాట్లు జరుగుతుంటాయి. వీడియోలో బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్రమాద హెచ్చరికగా అలెర్ట్ సైరన్ వినిపిస్తున్నప్పటికీ, నెతన్యాహు ఏమాత్రం తడబడకుండా, కనీసం స్పందించకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం.

Also Read : రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

యుద్ధ వాతావరణంలో ఉన్న దేశ ప్రధాని ఇలాంటి శబ్దాలను పట్టించుకోకుండా ఉండటం అసాధారణమని, ఇది ముందుగా రికార్డ్ చేసిన లేదా ఎడిట్ చేసిన వీడియో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నెతన్యాహు మీడియా ప్రతినిధుల సమక్షంలో లేదా కనీసం అధికారిక సెటప్‌ లో కనిపిస్తుంటారు. కానీ ఈ వీడియోలో ఆయన ఒక్కరే ఒక చీకటి గదిలో లేదా ప్రైవేట్ ప్రదేశంలో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ ఎవరూ లేకపోవడం, కేవలం వీడియో సందేశం మాత్రమే రావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో నెతన్యాహు మరణించారని లేదా తీవ్రంగా గాయపడ్డారని కొన్ని అంతర్జాతీయ సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అధికారిక బాధ్యతల్లో నిమగ్నమయ్యారని స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్