Saturday, September 19, 2026 07:18 PM
Saturday, September 19, 2026 07:18 PM

అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్ యూరప్, గల్ఫ్..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో కొన్ని కీలక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా రాష్ట్రానికి సంబంధించి బ్రాండ్ పెంచేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. విశాఖలో 15 బిలియన్ డాలర్లు గూగుల్ పెట్టుబడి పెడుతోంది. ఇక ఇక్కడి నుంచి పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read : మాతో మీకు పోలికేంటి..? బెంగళూరుకు పెమ్మసాని కౌంటర్

ఇక ఈనెల 24 నుంచి 26 వరకు చంద్రబాబు దుబాయిలో పర్యటిస్తారు. అలాగే అబుదాబిలో కూడా చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా తెలుగువారితో ఆయన మమేకం కానున్నారు. పీ 4 కార్యక్రమంలో తెలుగువారిని భాగస్వామ్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖపట్నంలో నవంబర్ 14, 15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు పెట్టుబడిదారులను ఆహ్వానించడం, పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పర్యటనకు అనుమతులు ఇస్తుంది.

Also Read : మంత్రి పదవి పోవడం ఖాయమా..?

ఇక దీని తర్వాత చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తారు. సిఐఐ సదస్సు విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో లండన్ నుంచి కూడా పెట్టుబడిదారులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ రెండు నుంచి ఐదు వరకు ఆయన లండన్ లో పర్యటిస్తారు. చంద్రబాబుతో పాటుగా ఆయన ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా లండన్ వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సీఎం ఓ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ పెట్టుబడులలో ఎక్కువగా ఆటోమొబైల్ తో పాటుగా ఐటీ పరిశ్రమ కు సంబంధించి ఉండనున్నాయి. ఇప్పటికే ఎవరిని కలవాలి అనేదానికి సంబంధించి ఒక రోడ్ షో కూడా రెడీ చేసుకున్నారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్