Wednesday, August 5, 2026 07:37 AM
Wednesday, August 5, 2026 07:37 AM

చంద్రబాబుకు కేంద్రంలో కీలక బాధ్యతలు

ఏపీ సిఎం చంద్రబాబుకు బిజెపి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. హర్యానా ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు నూతన ఉత్సాహంతో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్డియేని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత తగ్గించిన బిజెపి అధిష్టానం ఇప్పుడు మాత్రం కీలక అడుగులు వేస్తోంది. ఎన్డియేలో త్వరలోనే కొన్ని మార్పులు ఉండే అవకాశం కనపడుతోంది.

రేపు హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 నుంచి 2 వరకు చండీఘడ్ లో జరగనున్న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు అవుతారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు చండీఘడ్ లో జరగనున్న ఎన్ డీ ఏ పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. తిరిగి రాత్రి కి విజయవాడ చేరుకుంటారు చంద్రబాబు. అయితే ఈ సమావేశంలోనే చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం.

Also Read : ఏపీలో మందుబాబులకు పండుగ.. కొత్త రూల్స్ ఇవే

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని బిజెపి పట్టుదలగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలకు ఎన్డియేలో ప్రాధాన్యత పెంచడంతో పాటుగా తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసేందుకు… చంద్రబాబును ఎన్డియే కన్వినర్ గా ఎంపిక చేయాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చినా ఆయన దానిపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మాత్రం కచ్చితంగా బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోడీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్