Thursday, September 17, 2026 09:42 PM
Thursday, September 17, 2026 09:42 PM

భయపెడుతోన్న బందరు బాదంపాలు..!

కల్తీ.. ఇప్పుడు ఏపీలో ఈ పదానికి వెయిట్ ఎక్కువ. కల్తీ నెయ్యి వ్యవహారంతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ విమర్శలు, శాసన మండలిలో వాయిదా తీర్మానాలు, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో మాటల యుద్ధం ఇవన్నీ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని వైసీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం చూసాం. ఇక ఇప్పుడు రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనం అయింది.

Also Read : ఏపీ తెలుగు మహిళగా స్వామి శిష్యులు..!

కల్తీ పాల కారణంగా కిడ్నీ, జీర్ణ సమస్యలు సహా ఎన్నో వచ్చాయని వార్తలు రావడం, ఆ తర్వాత దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అనే కథనాలతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీనితో ఏపీ వ్యాప్తంగా పాల కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాలపై అధికారుల విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టి.. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : ఇండియన్స్ కు ట్రంప్ బిగ్ షాక్..?

మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్‌లో తనిఖీలు చేసిన అధికారులు.. పెద్ద ఎత్తున కల్తీ పాలను గుర్తించారు. అలాగే బందరులో ఫేమస్ అయిన బాదంపాలు కూడా కల్తీవి గుర్తించారు. ఎంఆర్పీ, తయారీ తేదీ లేని, చాలాకాలం ఫ్రిజ్‌ లో నిల్వ ఉంచిన బాదంపాల ప్యాకెట్లను గుర్తించారు అధికారులు. పాల కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు అధికారులు. మచిలీపట్నంలో తయారయ్యే బాదంపాలు విజయవాడ, గుంటూరు నగరాల్లో పెద్ద ఎత్తున విక్రయిస్తూ ఉంటారు. బందరు బాదంపాలుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్