Saturday, September 19, 2026 08:36 PM
Saturday, September 19, 2026 08:36 PM

ఏపీ ఐపీఎస్ ను వదలని హీరోయిన్ కేసు.. డ్యూటీ కష్టమే..!

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్ట్ మరియు వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ ను రద్దు చేస్తూ గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. దీంతో ఆయన సస్పెన్షన్ ప్రస్తుతానికి కొనసాగనుంది. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిని అక్రమంగా అరెస్టు చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విశాల్ గున్నిని సస్పెండ్ చేసింది.

Also Read : ఆ ఇద్దరికి ప్రతిపక్ష హోదా వస్తుందా..?

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ ను ఆశ్రయించగా, గతేడాది ఆగస్టు 28న క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సస్పెన్షన్‌ ను రద్దు చేయడమే కాకుండా, తక్షణమే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశించింది. క్యాట్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే విశాల్ గున్ని ముంబై వెళ్లి అరెస్టుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు.

Also Read : బాబు రికార్డు అన్ బ్రేకబుల్..!

ఇది తీవ్రమైన విధి నిర్వహణ లోపమని కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కాలపరిమితి ముగియక ముందే క్యాట్ జోక్యం చేసుకోవడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడిందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్ కుమార్‌ లతో కూడిన ధర్మాసనం, ఈ అంశంపై మరింత లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 29 కి వాయిదా వేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్