Monday, October 5, 2026 02:30 PM
Monday, October 5, 2026 02:30 PM

రాజధాని రైతులకు మరో మినహాయింపు

రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మాణాల విషయంలో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తుంది. కొత్తగా విమానాశ్రయం కోసం భూ సమీకరణ పైన తాజాగా కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా సీఆర్‌డీఏ గ్రామాల వారీగా చర్యలు తీసుకుంటోంది. కాగా.. గ్రామకంఠాల విషయంలో తెర మీదకు వచ్చిన అంశాల పైన తాజాగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో భూ సమీకరణ సమయంలో పలు గ్రామాలను, వాటిని ఆనుకుని ఉన్న పశువుల కొట్టాలను గ్రామకంఠాల కింద పరిగణించి.. భూ సమీకరణ నుంచి మినహాయించారు.

Also Read : జగన్‌ చేతిలో 40 కోట్ల సుపారీ గుట్టు

అయితే.. తమ భూములను కూడా గ్రామకంఠాల కింద పరిగణించి.. భూ సమీకరణ నుంచి మినహాయింపు కోసం పలువురు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఆర్‌డీఏ రూపొందించిన నిబంధనలను అనుసరించి.. ప్రభుత్వం కొంతమంది రైతుల భూముల మినహాయింపునకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూములను మినహాయింపు చేశారని కొన్ని గ్రామాల వారు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. గ్రామకంఠాల మినహాయింపులలో జరిగిన అవకతవకలపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రి నారాయణతో, సీఆర్‌డీఏ అధికారులతో చర్చించిన అనంతరం.. చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : పవన్, లోకేష్ మధ్య గ్యాప్ ఉందా.. నిజమేనా..?

అమరావతి గ్రామకంఠాల మినహాయింపులను పునః పరిశీలించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా.. మినహాయింపులు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించి.. సీఆర్‌డీఏకు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కొందరు అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో పనులు పూర్తయితే చుక్కా నీరు నిలబడే అవకాశం లేదని చెప్పారు. నెదర్లాండ్ టెక్నాలజీని రాజధాని నిర్మాణంలో వినియోగిస్తున్నామని.. కొండవీటి వాగు, పాలవాగు గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి లేదన్నారు. 22 వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించే విధంగా కాలువల నిర్మాణం జరిగిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరో వైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పైన ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఓఆర్ఆర్ పరిధిని ఖరారు చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బొత్సను ఒంటరిని చేస్తున్న...

ఉత్తరాంధ్ర రాజకీయ ఖిల్లా విజయనగరం జిల్లా...

అన్నదమ్ములకు అసలైన పరీక్ష..!

సాధారణంగా ఒకే పార్టీలోనే ఇద్దరు నాయకుల...

పవన్, లోకేష్ మధ్య...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

పోల్స్