Wednesday, May 6, 2026 11:19 PM
Wednesday, May 6, 2026 11:19 PM

మంత్రుల మాటకు విలువ ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారుల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నాం. రాజకీయంగా ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ అధికారులు.. మాత్రం మంత్రులు, ప్రజా ప్రతినిధుల మాట లెక్కచేయడం లేదు. శాఖ పరంగా మంత్రుల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉండి.. ఫైల్స్ ఆగమేగాల మీద ముందుకు కదలాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ.. అధికారులు మాత్రం మంత్రుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట మినహా ఇతర మంత్రులు మాట అధికారులు వినడం లేదు.

Also Read : పవన్ ను వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు..!

కనీసం తమ తమ శాఖల అధికారులకు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితిలో కొంతమంది మంత్రులు ఉన్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా స్పష్టమైన సమాచారాన్ని అధికారులు ఇవ్వడం లేదని.. ఇంచార్జ్ మంత్రులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదు అనేది ప్రభుత్వంలో వినబడుతున్న మాట. పరిశ్రమలు, రెవెన్యూ, ఆర్థిక శాఖ వంటి వాటిల్లో ఇతర మంత్రులు పంపిన ఫైల్స్ ముందుకు కదలడం లేదు.

Also Read : మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

మంత్రులు సమీక్ష నిర్వహించిన సమయంలో కూడా కొంతమంది అధికారులు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు సైతం వినపడుతున్నాయి. కీలక సమీక్ష సమావేశాలు ఉన్న సమయంలో లీవ్ పెట్టి వెళ్ళిపోవడం.. ఫీల్డ్ విసిట్ పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్ళటం వంటివి కొందరు అధికారులు చేస్తున్నారని విమర్శ వినపడుతుంది. ఇటీవల ఒక కొత్త మంత్రి ఒకే ఒక శాఖకు ఫైల్ పంపగా దానిపై అక్కడి అధికారులు కనీసం స్పందించకపోవడంతో.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులకు పనులు వేగంగా జరుగుతున్నాయనేది కూడా మరో ఆరోపణ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్