Thursday, August 6, 2026 07:54 AM
Thursday, August 6, 2026 07:54 AM

ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవనరుల వివాదం చర్చకు వచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఉన్న జల సౌదాలో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సెక్రటరీలు, చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. బోర్డు నిర్వహణకు నిధుల కేటాయింపు బడ్జెట్ ఆమోదం నీటి వాటాల పంపకం ఉమ్మడి ప్రాజెక్టులు, రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ నుంచి ఈఎంసి అనిల్ కుమార్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా ఏపీ నుంచి ఈఎంసి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ సాయిప్రసాద్ హాజరు అయ్యారు.

Also Read : టార్గెట్ బడా నిర్మాతలు.. హైదరాబాద్ లో భారీగా ఐటి సోదాలు..!

కృష్ణ బేసిన్ ఆధారంగా 70 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ఉండగా.. 30 శాతం పరివాహక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అంతర్ రాష్ట్ర జలాల వాటాలో భాగంగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. ఏపీ పునర్విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు తెలంగాణకి 298 టీఎంసీల పంపకాలపై అప్పట్లో ఇరు రాష్ట్రాల మంత్రులు సంతకం చేసారు. 70% నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున సమానంగా నీటి వాటా పంచాలని తెలంగాణ వాదిస్తోంది. పాత కేటాయింపులు కొనసాగించాలని ఏపీ వాదిస్తోంది.

Also Read : వచ్చిన పనేంటి.. చంద్రబాబు మాస్ వార్నింగ్..!

కొద్ది రోజుల క్రితం నీటి వాటాల పంపకంపై ఇరు రాష్ట్రాల వాదనలు వినేందుకు సుముఖత చూపించింది ట్రిబ్యునల్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో నేడు కీలక సమావేశం నిర్వహించారు. పునర్విభజన నిబంధనల ప్రకారం కె ఆర్ ఎం బి బోర్డు ఏ పి లో… జి ఆర్ ఎం బి బోర్డు హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏపీ ప్రభుత్వ హయాంలో బోర్డును వైజాగ్ తరలించాలని నిర్ణయంతో విజయవాడకి లోనే ఏర్పాటు చేయాలంటూ కేఆర్ఎంబి చైర్మన్ ని కలిసిన ఏపీ సంఘాల సభ్యులు సోమవారం కలిసారు. ఇక ఈ సమావేశంలో నారాయణ పేట్ కొడంగల్ ప్రాజెక్ట్, అచ్చంపేట సుంకిశాల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపింది ఏపీ ప్రభుత్వం. రాయలసీమ పోతి రెడ్డి పాడు విస్తరణ, ఆర్ డీ ఎస్ కుడికాలువ పనుల పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్