Saturday, September 19, 2026 10:15 PM
Saturday, September 19, 2026 10:15 PM

మంగళానికి జనసేన జై

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కో నాయకుడు ఆ పార్టీ నుంచి బయటికి వస్తున్నారు. వైసీపీలో భవిష్యత్తు లేదు అనుకున్న నాయకులు కొంతమంది ఇప్పుడు పార్టీలు మారేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన నాయకులు కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఇప్పుడు పార్టీలు మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది విషయంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కాస్త సానుకూలతను ప్రదర్శిస్తున్నాయి.

Also Read : ఏపీ బియ్యం దొంగలపై కొత్త సిట్.. జాగ్రత్త పడ్డ సర్కార్…!

తాజాగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ముందు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని భావించినా… అక్కడకు వెళితే అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించి ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి నాయకత్వం లేకపోవడంతో ఆ ఖాళీని జయమంగళ వెంకటరమణ భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : ఆర్బిఐ గవర్నర్ టూ ప్రధాని.. అవినీతి మరకలేని నేత…!

అటు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో పార్టీలో చేరే అవకాశం కనబడుతోంది. అలాగే ఆయనతో పాటుగా మరి కొంతమంది కైకలూరు నియోజకవర్గ వైసిపి నేతలను కూడా పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జయమంగళ జనసేనలోకి వెళ్లడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరితే కచ్చితంగా కైకలూరు నియోజకవర్గంలో కూటమిలో ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన కొంతమంది నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. టిడిపిలో చేరే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్