Wednesday, August 5, 2026 07:50 AM
Wednesday, August 5, 2026 07:50 AM

అలా మన తెలుగు హీరోలు చేయలేరా…?

తెలుగు సినిమాలు మనం గమనిస్తే విలక్షణం, విభిన్నం, వంటి పదాలు ఎక్కడా ఉండవు. ఇప్పుడు ఏదో ఇతర భాషల్లో హీరోలు ట్రై చేస్తున్నారు కాబట్టి కాస్తో కూస్తో నటన కోసం ప్రయత్నం చేస్తున్నారు గాని లేదంటే నాలుగు ఫైట్ లు, నాలుగు డాన్స్ లు, హీరోని ఫ్యామిలీ మెంబర్స్ పొగిడే సీన్స్. ఇవి తప్పించి సినిమాలో ఏం ఉండవ్. ఈ తరం హీరోలు అదే ట్రెండ్ ఫాలో అయ్యేవారు. ట్రెండ్ అనడం కంటే మూస పద్దతిని ఫాలో అయి మాస్ ఆడియన్స్ ను అలరించేవారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోసం వేరే భాషల్లో సినిమాలు చూస్తున్నారు.

Also read : బొత్సలో ఎందుకీ వైరాగ్యం..?

ఇప్పుడు కథల విషయంలో మన తెలుగు సినిమాలు పెద్ద గొప్పగా ఏం ఉండవు. కాకపోతే కాస్త డిఫరెంట్ గా నటిస్తున్నారు అంతే. పుష్ప కథ గొప్పది ఏం కాదు… అందులో హీరో డాన్ ఎలా అయ్యాడు అన్నదే స్టోరీ. ఇక దేవర గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మహేష్ బాబు సినిమాలు కామెడి పీస్ లు అయ్యాయి. ప్రభాస్ సినిమాల్లో డైరెక్టర్లు హీరోలు. కాని నిజ జీవితంలో హీరోలను ఎంచుకుని సినిమాలు చేయడం, ప్రముఖుల జీవితాలపై బయోపిక్ లు చేయడం, ప్రజలకు దగ్గరయ్యే కథలు చూపించడంలో మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే చెప్పుకోవాలి.

Also Read : కోడెలకు మద్దతుగా పవన్ కళ్యాణ్

ఉదాహరణ తమిళ హీరోలను తీసుకుంటే… ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిన వారు, శాస్త్రవేత్తలుగా కష్టపడిన వాళ్ళు.. ఇలా కాస్త భిన్నంగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన అమరన్ సినిమా కథ చాలా బాగుంది. 2014 లో కాశ్మీర్ లో ఉగ్రవాదులపై పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ముకుంద్ వరద రాజన్ జీవితాన్ని కథగా తీసుకుని సినిమా చేసారు. మన తెలుగులో ఆ సాహసం ఈ మధ్య కాలంలో ఒక్క అడవి శేష్ మాత్రమే చేస్తున్నాడు. మహేష్ బాబుకు ఆ ఇమేజ్ ఉన్నా… చేసే ప్రయత్నం చేయడం లేదు. ఎందరో ప్రముఖుల జీవితాలను తెరపై చూపించే అవకాశం ఉంది. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నా మన హీరోలు దర్శకులు ఆ సాహసం చేయడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్