Saturday, June 20, 2026 09:25 PM
Saturday, June 20, 2026 09:25 PM

ఏపీలో ఆమ్రపాలి కి సంచలన బాధ్యతలు..?

ఏపీ వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్న ఐఏఎస్ అధికారులకు తెలంగాణా హైకోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలసిందే అని హైకోర్ట్ స్పష్టం చేసింది. తమను తెలంగాణాలోనే విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్ట్ లో ఐఏఎస్ అధికారులు పిటీషన్ దాఖలు చేయగా… కోర్ట్ డిస్మిస్ చేసింది. 15 రోజుల పాటు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినా కోర్ట్ నిరాకరించింది. ముందు ఏపీలో రిపోర్ట్ చేస్తే తర్వాత మీ సమస్యలు వింటాం అని క్లారిటీ ఇచ్చింది. నేడు సాయంత్రం అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.

ఇలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటే సమస్య మరింత తీవ్రంగా మారుతుందని, పరిస్థితిని అర్ధం చేసుకుని ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్ధించింది కోర్ట్. దీనితో ఆమ్రపాలి సహా నలుగురు అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇక హరి కిరణ్, సృజన, శివశంకర్ తెలంగాణాలో రిపోర్ట్ చేయాలి. ఇక అధికారులకు 15 రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. ఈ విషయాన్ని పిటీషనర్ల తరుపు న్యాయవాదులు కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళినా కోర్ట్ వినలేదు.

Also Read : గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ ఎవరు…??

ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకుంటే ఇది నెవెర్ ఎండింగ్ స్టోరీ అని తీర్పు సందర్భంగా కోర్ట్ ఐఏఎస్ అధికారులకు స్పష్టత ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలంగాణాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా అమ్రాపాలిని నియమించే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ గా… దాసరి హరిచందన ను నియమించే అవకాశం కనపడుతోంది. అమ్రాపాలిని సిఆర్డియే కమీషనర్ గా నియమించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్