Wednesday, February 4, 2026 08:16 PM
Wednesday, February 4, 2026 08:16 PM

పవన్ కి దగ్గరవ్వాలనే ఆలీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

పవన్ కళ్యాణ్, అలీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరకు పవన్, అలీ మధ్య సత్సంబంధాలు ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అలీ వైసీపీలో చేరి ఎంపీగా పోటీచేయాలని ఉత్సాహపడిన సంగతి తెలిసిందే. అయితే చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా మాత్రమే అవకాశం లభించి, ఆ తరువాత ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆ పార్టీకి సైతం గుడ్ బై చెప్పి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటానంటూ వీడియో సందేశం విడుదల చేశారు.

వైసీపీలో చేరిన తరువాత వేషాలు బాగా తగ్గాయి అన్న టాక్ సినీ వర్గాల్లో వినిపించాయి. ఇక ఈమధ్య డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ ముఖ్య పాత్రలో నటించగా ఈ సినిమాలో అలీ నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు అలీ పవన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సరిపోదా శనివారం మూవీ ఈవెంట్ లో అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో హీరో నాని ఉపయోగించిన ఎర్ర తుండు, కడియం, పుస్తకాన్ని సుమ చూపించగా అలీ ఎర్ర తుండు తీసుకున్నాడు. ఆ ఎర్ర తుండుకు ఒక స్పెషాలిటీ ఉందని ఆ స్పెషాలిటీ ఏంటో వాళ్లకు తెలుసంటూ పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా అలీ కామెంట్స్ చేశారు.

ఈ ఎర్ర రక్తం మన శరీరంలో ఉంటే దానికి ‘పవర్’ ఎక్కువ అని అలీ పేర్కొన్నారు. ఖుషి డైరెక్టర్ సూర్య అంటూ, ఓజీ నిర్మాత దానయ్య అంటూ పవన్ సినిమాల పేర్లు గుర్తు చేస్తూ అలీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అలీ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. అలీ రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుని మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అలీ సరైన పాత్రలను ఎంచుకుంటే ఆయనకు మరిన్ని విజయాలు దక్కడం కష్టం కాదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్