Wednesday, September 30, 2026 03:40 PM
Wednesday, September 30, 2026 03:40 PM

కుమార్తె పెళ్లి తర్వాతే అసలైన ఆట.. ఏపీ రాజకీయాలపై వైఎస్ షర్మిల ఫుల్ ఫోకస్..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజిలీ రెడ్డి వివాహం ముగిసిన తర్వాత పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. కూతురి పెళ్లి తర్వాత షర్మిల పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం పైనే దృష్టి సారించే అవకాశం ఉందని, పొలిటికల్ సర్కిల్స్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆమె.. ఆ తర్వాత పూర్తి సమయాన్ని పార్టీ బలోపేతానికి, ప్రజా పోరాటాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : వైసీపీ టూ జనసేన.. ఎవరికి లాభం..?

ఇటీవలే హైదరాబాద్‌ వేదికగా వైఎస్ షర్మిల కుమార్తె అంజిలీ రెడ్డి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ జరగనున్నట్లు స్వయంగా షర్మిల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మొదటి వివాహ పత్రికను ఉంచి వైఎస్ఆర్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

అయితే, ఈ పెళ్లి పిలుపుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తన అన్న, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వివాహానికి ఆహ్వానించేందుకు సిద్ధమవ్వడం, అంతలోనే కొన్ని సోషల్ మీడియా వేదికల్లో షర్మిల మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీ వైపు వెళ్తున్నారనే ప్రచారాలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూమర్లపై షర్మిల ఘాటుగానే స్పందించారు. తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోనని, పెళ్లి పేరుతో రాజకీయ పావులు కదపాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం కుటుంబ బాధ్యతగా మాత్రమే అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తేల్చి చెప్పారు.

ఇక అది అలా ఉంచితే, రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. డిసెంబర్ మొదటి వారంలో కుమార్తె పెళ్లి బాధ్యతలు పూర్తిగా ముగిసిపోనున్నాయి. ఆ తర్వాత షర్మిలకు ఎలాంటి వ్యక్తిగత లేదా కుటుంబపరమైన పెద్ద బాధ్యతలు ఉండవు. దీంతో, వచ్చే ఏడాది నుండి ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అటు అధికార కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంకే లక్ష్యంగా పాదయాత్రలు లేదా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

Also Read : కేంద్ర ఎన్నికల సంఘంలో తీవ్రమవుతున్న విభేదాలు..!

షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. రాజకీయంగా.. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయకపోతే షర్మిల, రాజకీయ మనుగడకు కూడా అది ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇక పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, డిసెంబర్ తర్వాత ఏపీ రాజకీయంలో షర్మిల మార్క్ మరింత స్పీడ్‌గా ఉండబోతుందనేది మాత్రం స్పష్టమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కొత్త ఓటర్లకు గుడ్...

దేశంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను...

జగన్‌ను జైల్లో పెట్టిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న...

దుబాయ్ విమానం హైజాక్..?...

దుబాయ్ నుండి ఇజ్రాయెల్ రాజధాని టెల్...

కాపులపై ప్రేమ కాదు,...

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది....

ఏపీ మద్యం స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ హయాం...

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

పోల్స్