Tuesday, November 24, 2026 04:45 PM
Tuesday, November 24, 2026 04:45 PM

నాకేం సంబంధం లేదు.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. దేశంలో నిర్మాణం అవుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి అశ్విని వైష్ణవ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ముంబయి – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో భాగంగా గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య గల 50 కిలోమీటర్ల మార్గంలో 2027 మే నెలలో తొలి ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించే మొదటి మార్గం ఇదే అని తెలిపారు. ఎలివేటెడ్ ట్రాక్‌పై ఉన్న అప్ అండ్ డౌన్ లైన్లకు విద్యుత్ సరఫరా కూడా విజయవంతంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి సిగ్నలింగ్ వ్యవస్థ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కూడా.

Also Read : ఆస్ట్రేలియా మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్..బయటపడ్డ సంచలన నిజాలు..!

ఇదే సమయంలో దేశంలో జరుగుతున్న ఇతర రైల్వే ప్రాజెక్టులపై కూడా వివరాలు వెల్లడించారు. అయితే హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టు నిధులు, అనుమతుల విషయంలో ప్రస్తుతం కీలక చర్చలు, పరిణామాలు జరుగుతున్నాయి. మెట్రో రెండో దశ విస్తరణను తప్పకుండా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కూడా. మెట్రో రెండో దశ నిర్మాణం కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేకంగా చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఒకటికి రెండుసార్లు అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విషయంపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం తన వంతు సాయం అందిస్తుందని కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు.

కానీ తాజాగా అశ్వినీ వైష్ణవ్ మాత్రం.. మాట మార్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఆర్థిక సాయం అందించడం తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేసే అంశంపై తనకు సమాచారం లేదని కూడా తెలిపారు. అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఏడాది జూన్ 22న అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన విషయాన్ని.. ఆ సమయంలో నిధుల విడుదల కోరుతూ రాసిన లేఖను కూడా ఇప్పుడు బయటపెట్టారు.

Also Read : రెచ్చిపోయిన ఉక్రెయిన్.. రష్యా యుద్ధనౌకను పేల్చేసింది..!

ఐఆర్ఎఫ్‌సీ ద్వారా రుణం విషయంపై అశ్వినీ వైష్ణవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మే 25వ తేదీన ఐఆర్ఎఫ్‌సీతో రీ ఫైనాన్సింగ్ ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సంతకం చేసి ఇప్పటికే 7 నెలలు దాటినా.. డబ్బు ఇంకా అందలేదని తెలిపారు. ఐఆర్ఎఫ్‌సీ రుణం విడుదల చేయలేదని.. ఒప్పందాన్ని కూడా రద్దు చేయలేదని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ జాప్యం ఇప్పటికే సమయం వృధా చేసిందని ఆరోపించారు కూడా. హైదరాబాద్ మెట్రో రెండో దశకు నిధులు, డిపిఆర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చేస్తున్న అభ్యర్థనలకు కూడా కేంద్రం స్పందించలేదు. రెండో దశను కేంద్రంతో సంయుక్త భాగస్వామ్యంగా చేపట్టాలని తెలంగాణ కోరుకుంటోంది. కానీ కేంద్ర మంత్రి మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు ప్రాజెక్టు పురోగతిపైనే చర్చకు తెర లేపినట్లు అయ్యింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

యలహంక ఆస్తులు.. వివేకా...

బెంగళూరులోని యలహంక పరిధిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...

రహదారి భద్రతలో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి కేంద్రంగా ఏర్పాటు...

ఆస్ట్రేలియా మరో బాల్...

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్...

ఆసియా పవర్ ఇండెక్స్...

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మేధో...

భూమన ఫేక్ ప్రచారానికి...

కడప-రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా...

పులివెందుల చరిత్రలో కొత్త...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

పోల్స్