రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి పత్రిక యాజమాన్యానికి అమరావతి రైతు, కంచర్ల సాంబశివరావు కుటుంబం రూ. 10 కోట్ల పరువు నష్టం నోటీసు జారీ చేసింది. అమరావతి పరిధిలోని వెలగపూడి గ్రామంలో గ్రామకంఠం ముసుగులో భూ మాయాజాలం జరిగిందంటూ ఇటీవల సాక్షి పత్రిక మరియు సాక్షి టీవీలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. రాజధాని భూసమీకరణలో భారీ కుంభకోణం జరిగిందని, కంచర్ల సాంబశివరావు విక్రయించిన భూములకు..
Also Read : జగన్ చెప్పినా వినను.. బొత్సా హాట్ కామెంట్స్..!
ప్రతిగా గ్రామకంఠం పేరుతో ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపులు దక్కాయని ఆ కథనాల్లో ఆరోపించారు. అయితే, ఈ కథనాలపై కంచర్ల సాంబశివరావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. తమకు ఏమాత్రం సంబంధం లేని భూములను తమ పేరుతో ముడిపెట్టి, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా కథనంలో ప్రస్తావించిన సర్వే నంబర్ 91/1F లో తమకు కనీసం సెంటు భూమి కూడా లేదని కంచర్ల సాంబశివరావు స్పష్టం చేశారు.
Also Read : భారత్ లో పాక్ చిల్లర ఆపరేషన్.. ఆర్మీలో ఏం జరుగుతోంది..?
కనీస వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారంతో తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. ఈ తప్పుడు కథనాలపై సాక్షి పత్రిక యాజమాన్యం 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఇప్పటివరకు ప్రచురించిన అసత్య కథనాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కంచర్ల సాంబశివరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సాక్షి యాజమాన్యంపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


