Saturday, November 14, 2026 06:01 PM
Saturday, November 14, 2026 06:01 PM

జగన్ చెప్పినా వినను.. బొత్సా హాట్ కామెంట్స్..!

ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరించే వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార కూటమి నేతలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటే తమ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని బొత్స అభిప్రాయపడ్డారు.

Also Read : భారత్ లో పాక్ చిల్లర ఆపరేషన్.. ఆర్మీలో ఏం జరుగుతోంది..?

అందరినీ సమానంగా చూసే ఈక్వాలిటీ రాజకీయాలు ఇకపై ఏమాత్రం పని చేయవేమో అనిపిస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా అయ్యో పాపం అని వదిలేసే పరిస్థితులు ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండవని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తగిన విధంగా సమాధానం చెబుతామని, చుక్కలు చూపిస్తామని బొత్స హెచ్చరించారు. తాను ఇవే మాటలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా నేరుగా చెప్పానని హాట్ కామెంట్స్ చేసారు.

అయితే అలాంటి రాజకీయాలు వద్దని జగన్ చెప్పినప్పటికీ తాను మాత్రం మారకూడదని ఫిక్సయ్యానని బొత్స సంచలన ప్రకటన చేశారు. ఇదే సమావేశంలో గత ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై బొత్స విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా మొత్తం మీద కూటమికి, వైసీపీకి మధ్య కేవలం 6 వేల ఓట్ల మెజారిటీ తేడా మాత్రమే ఉందని ఆయన విశ్లేషించారు. గత ఎన్నికల్లో జనసేన తోడు లేకపోయి ఉంటే విజయనగరం జిల్లాలో వైసీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : కివీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్..!

కూటమి నేతలకు వారిపై వారికే నమ్మకం లేదని, అందుకే బీసీల పేరు చెప్పి ఓసీలను తీసుకువచ్చి పోటీ చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత మొదలైందని బొత్స మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలపై ఈగ వాలినా చూస్తూ ఊరుకోబోమని, కూటమితో తాడోపేడో తేల్చుకునేందుకు జిల్లా కేడర్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటమి తర్వాత కూడా వైసీపీ శ్రేణుల్లో మళ్లీ గెలిచినంత ఉత్సాహం కనిపిస్తోందని, 2029 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ తిరిగి విజయం సాధించడం ఖాయమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సాక్షి ఛానల్ కు...

రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అసత్య...

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

కూటమికి ఇబ్బందిగా మారిన...

అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో...

డేంజర్ జోన్‌లో ఏపీ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా...

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

పోల్స్