Saturday, November 14, 2026 01:03 PM
Saturday, November 14, 2026 01:03 PM

కివీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్..!

న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టులో కీలక మార్పులు చేసింది. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌కు కొద్దిరోజుల ముందు స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌ను టెస్ట్ స్క్వాడ్‌లోకి తీసుకుంది. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వెల్లింగ్టన్‌లో భారత టెస్ట్ జట్టుతో కలిశాడు.

Also Read : కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

న్యూజిలాండ్‌లోని పిచ్‌లు పూర్తిగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం కంటే, భారత్‌లో జరుగుతున్న దేశవాళీ క్రికెట్ ఆడటానికి పంపడమే ఉత్తమమని సెలెక్టర్లు భావించారు. ఇక టెస్ట్ జట్టులోకి ఎంపికైన గుర్నూర్ బ్రార్ ఆదివారం జరగనున్న ఐదో వన్డేకు అందుబాటులో ఉండడు. అతను నేరుగా టెస్ట్ స్క్వాడ్‌తో కలవనున్నాడు. ఐదో వన్డేకు అతని స్థానంలో మరెవరినీ తీసుకోలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

Also Read : సీఐఐ సమ్మిట్‌లో లోకేష్, రానా దగ్గుబాటి ఆసక్తికర సంభాషణ..!

ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటీ అంటే.. రిషబ్ పంత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అక్టోబర్‌లో శ్రీనగర్ వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, ఆ మ్యాచ్‌లో పక్కటెముకల గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రీహాబిలిటేషన్ తీసుకుంటున్న పంత్, తాజాగా మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. ముందుగా ఇండియా-ఎ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు అదనపు సమయం పట్టడంతో నేరుగా సీనియర్ టెస్ట్ జట్టుతో చేరాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సర్పంచ్.. ఒకటో సారి.....

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ...

కూటమికి ఇబ్బందిగా మారిన...

అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో...

డేంజర్ జోన్‌లో ఏపీ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా...

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

నా ఫోన్ లో...

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత...

పోల్స్