Wednesday, November 11, 2026 03:15 PM
Wednesday, November 11, 2026 03:15 PM

ట్రోలర్స్ కు సాయి పల్లవి స్లిప్పర్ షాట్..!

ఈ రోజుల్లో సినిమాల్లో పాత్రలు ఎవరు ఉండాలి..? ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువైపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు అనగానే ఈ హడావుడి ఇంకాస్త ఎక్కువ. రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రామాయణం సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసినప్పటి నుండి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఆమె హిందీ యాస సరిగ్గా లేదని, సీతాదేవి పాత్రకు తగ్గ అందం, దివ్యత్వం ఆమెలో లేవంటూ కొందరు నెటిజన్లు, విమర్శకులు దారుణంగా కామెంట్స్ చేశారు.

Also read : ఏపీ రాజకీయాల్లో పరివర్తన.. సాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే..!

సాంప్రదాయక కథనాలకు భిన్నంగా ఈ సినిమాలో సీత అడవుల్లో రాముడు, లక్ష్మణుడితో కలిసి రాక్షసులతో కత్తి పట్టి యుద్ధం చేయడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత తన అద్భుతమైన నటనతో సాయి పల్లవి ఆ విమర్శలన్నింటికీ కౌంటర్ ఇచ్చింది. దర్శకుడు నితీష్ తివారీ ఈ తరం రామాయణంలో సీత పాత్రను కేవలం రక్షణ కోసం ఎదురుచూసే అబలగా కాకుండా, తనను తాను రక్షించుకునే ఒక వీరనారిగా మలిచారు.

ఇందుకోసం ఆయన వాల్మీకి రామాయణంతో పాటు అద్భుత రామాయణం వంటి ప్రత్యామ్నాయ గ్రంథాల నుండి స్ఫూర్తి పొందారట. చిన్నతనంలోనే శివధనుస్సును అలవోకగా ఎత్తడం, అరణ్యవాసంలో కత్తులు, విలువిద్యతో శత్రువులను ఎదుర్కోవడం, గాయపడిన లక్ష్మణుడిని కాపాడటం వంటి సన్నివేశాలలో సీత పాత్రకు ఒక కొత్త కోణాన్ని, నాయకత్వ లక్షణాలను జోడించారు. సాంప్రదాయకంగా పిలిచే స్వామి లేదా ఆర్యపుత్ర అనే పదాలకు బదులుగా రాముడిని కేవలం రామ్ అని పిలుస్తూ ఇద్దరినీ సమాన భాగస్వాములుగా చూపించడం ఈ చిత్రంలో మరో విశేషం.

Also read : మిర్చి రైతుల కోసం టీడీపి ఎంపీ పోరాటం.. శ్రీలంక కంటైనర్ల సంగతి ఏంటీ..?

సినిమాలో సీత పాత్రకున్న ప్రాధాన్యతను, ఆమెలో దాగి ఉన్న ధైర్యాన్ని సాయి పల్లవి తన కళ్ళతోనే పలికించి ప్రేక్షకులను ఫిదా చేసింది లేడీ సూపర్ స్టార్. లుక్స్, యాక్షన్ సీక్వెన్స్‌లపై ముందగా ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ఆమె నటనకు ఫిదా అవుతున్నారు. తన సహజ సిద్ధమైన నటనతో, విమర్శలను ఆమె ప్రశంసలుగా మార్చుకుని.. సాయి పల్లవి సరికొత్త చరిత్ర సృష్టించిందని సినీ విమర్శకులు సైతం కొనియాడుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

ఎవరి బీ టీమ్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సరికొత్త...

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక...

మిర్చి రైతుల కోసం...

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

పోల్స్