Wednesday, November 11, 2026 12:33 PM
Wednesday, November 11, 2026 12:33 PM

మిర్చి రైతుల కోసం టీడీపి ఎంపీ పోరాటం.. శ్రీలంక కంటైనర్ల సంగతి ఏంటీ..?

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ వేదికగా చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ఆయన ఢిల్లీలో విడివిడిగా కలిసి కీలక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

Also Read : వైసీపీ మీద ఓటర్లకు ఎందుకు కోపమంటే..!

ముఖ్యంగా, గత ఆగస్టు నెల నుండి శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన సుమారు 150కి పైగా భారతీయ మిర్చి కంటైనర్ల అంశాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లారు. తేమ శాతం నిబంధనల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా దాదాపు రూ. 60 కోట్ల విలువైన ఈ మిర్చి నిల్వలు అక్కడే చిక్కుకుపోయాయి. దీనివల్ల ఎగుమతిదారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లడమే కాకుండా, స్వదేశీ మార్కెట్‌లో మిర్చి ధరలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : సీఎం చంద్రబాబు భద్రతా ఘటనతో కేంద్రం సంచలన నిర్ణయం..!

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన చొరవ చూపి, శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి ఈ కంటైనర్లను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిర్చి వివాదంతో పాటు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఆయన చర్చలు జరిపారు. అలాగే, ఏపీలోని ప్రాసెసింగ్ కేంద్రాల్లో సుమారు 50 వేల మంది కార్మికుల ఉపాధిని రక్షించేందుకు, స్థానిక పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల కొరత రాకుండా తలవెంట్రుకల ఎగుమతులను క్రమబద్ధీకరించాలని కూడా పీయూష్ గోయల్‌ను కోరారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

నాకేమీ పేటీఎంలో డబ్బులు...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకులపై...

స్థానిక విజయాలతో అహం...

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల...

వైసీపీ మీద ఓటర్లకు...

అప్పుడు వైసీపీ ఓటమికి, వైసీపీ రెడ్లు,...

పోల్స్