దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ప్రత్యేక రక్షణ బలగాలు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఒత్తైన నల్లటి దుస్తులు, అత్యాధునిక ఆయుధాలతో వివిఐపిల రక్షణలో ఉండే ఈ బ్లాక్ క్యాట్ కమాండోల రాయల్ లుక్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, దశాబ్దాలుగా ఉన్న ఈ ఐకానిక్ బ్లాక్ యూనిఫామ్‌ను మార్చాలని ఇప్పుడు కేంద్ర హోంశాఖ, ఎన్‌ఎస్‌జీ విభాగం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. సిఆర్‌పిఎఫ్ పరిధిలోని కోబ్రా కమాండోల తరహాలో వీరికి కూడా సరికొత్త బ్రీతబుల్ అంటే గాలి, తేమ సులభంగా ఆడేలా ఉండే డిజిటల్ క్యామఫ్లేజ్ యూనిఫామ్‌లను ప్రవేశపెడుతున్నారు.
Also Read : స్థానిక విజయాలతో అహం వద్దు.. మంత్రులకు సీఎం వార్నింగ్..!
అయితే ఈ కీలక మార్పు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో జరిగిన ఒక ఉదంతమే ప్రధాన కారణం కావడం గమనార్హం. గతంలో చంద్రబాబు విజయవాడలో పాల్గొన్న ఒక పర్యటనలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో ఉంది. ఆ సమయంలో చంద్రబాబుకు అత్యంత సమీపంలో క్లోజ్ ప్రొటెక్షన్ ఇస్తూ నిలబడిన ఒక ఎన్‌ఎస్‌జీ కమాండో, తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బకు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. కమాండోలు ధరించే సాంప్రదాయ నల్లటి ఓవరాల్ దుస్తులు వేడిని ఎక్కువగా లాక్కుంటాయి.
దానికి తోడు భారీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, ఆయుధాల భారం శరీర ఉష్ణోగ్రతను ఒక్కసారిగా పెంచేసి ఆ ఘటనకు దారితీసింది. సీఎం చంద్రబాబు భద్రతా విభాగంలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఎన్‌ఎస్‌జీ ప్రధాన కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది. మారుతున్న భారత వాతావరణ పరిస్థితులు, కఠినమైన ఎండలను తట్టుకునేలా కమాండోల దుస్తులలో తక్షణ మార్పులు చేయాలని నిపుణుల కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌జీ నిపుణులు నైకో అనే ప్రత్యేకమైన వస్త్రంతో లైట్-వెయిట్ కొత్త యూనిఫామ్‌ను రూపొందించారు.
Also Read :చంద్రబాబు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్ల కలవరం..!
ఇది శరీరానికి గాలి బాగా తగిలేలా చేస్తూ, చెమటను త్వరగా పీల్చేసి కమాండోలను చల్లగా ఉంచుతుంది. ప్రస్తుతం దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా కేవలం 9 మంది ప్రముఖులకు మాత్రమే ఎన్‌ఎస్‌జీ ఈ క్లోజ్ ప్రొటెక్షన్ ఇస్తోంది. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచార సమయానికి ఈ విఐపిల భద్రతలో ఉండే బ్లాక్ క్యాట్స్ అందరికీ ఈ సరికొత్త యూనిఫామ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.


