Wednesday, November 11, 2026 03:34 PM
Wednesday, November 11, 2026 03:34 PM

షర్మిల ఔట్.. ఏపీ పీసీసీ చీఫ్‌గా ఆమంచి ..?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ సమీకరణాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడంతో, ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చీరాల సీనియర్ నేత, అమంచి కృష్ణమోహన్‌కు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పరిస్థితి మరింత పడిపోయిందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సీట్లు కూటమికి.. కానీ ఓట్లు మాత్రం..!

ఆమె కేవలం తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడంపైనే దృష్టి పెట్టారు తప్ప, ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై సరైన రీతిలో గళం విప్పడం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అమంచి కృష్ణమోహన్ అద్భుత విజయాలను సాధించి పెట్టారు. దాదాపు ఉనికి కోల్పోయిన స్థితి నుంచి పార్టీకి మళ్లీ జీవం పోయడమే కాకుండా, తన వ్యూహాలతో కాంగ్రెస్‌కు అసాధారణ గెలుపును అందించి సత్తా చాటారు.

Also Read : గాలి కాలుష్యం ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదా..?

ఈ విజయంతో సోషల్ మీడియా వేదికగా అమంచి పేరు మారుమోగిపోతోంది. ఏపీ కాంగ్రెస్‌కు అసలైన మాస్ లీడర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలన్నా, క్యాడర్‌లో నూతనోత్సాహం నిండాలన్నా నాయకత్వ మార్పు తప్పనిసరని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం కుటుంబ రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రజా సమస్యలపై పోరాడగల ప్రజా బలం ఉన్న అమంచి కృష్ణమోహన్‌ను షర్మిల ప్లేస్‌లో పీసీసీ చీఫ్‌గా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి అభిమానులు, కార్యకర్తలు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

ఎవరి బీ టీమ్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సరికొత్త...

ఏపీ రాజకీయాల్లో పరివర్తన.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఒక సంచలనాత్మక...

మిర్చి రైతుల కోసం...

ఏపీలో మిర్చి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాలే...

సీఎం చంద్రబాబు భద్రతా...

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, శత్రువుల గుండెల్లో...

చంద్రబాబు నిర్ణయంతో తెలుగు...

రాజకీయాల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికం కాదు.....

పోల్స్