Saturday, November 7, 2026 02:00 PM
Saturday, November 7, 2026 02:00 PM

పెట్రోల్‌లో అధిక ఇథనాల్.. ఆయిల్ కంపెనీల కీలక ప్రకటన..!

కర్ణాటకలో విక్రయిస్తున్న పెట్రోల్‌లో నిర్ణీత పరిమితి.. 20 శాతం కంటే ఎక్కువగా, దాదాపు 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్ కలుపుతున్నారంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్రంగా ఖండించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సేకరించిన నమూనాలు, పరీక్షల విధానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్పష్టం చేశాయి.

Also Read : చీరాలలో వైసీపీ కొంపముంచిన ఆమంచి..!

ఈ నివేదికలు చట్టబద్ధమైన, అధికారిక నిబంధనల ప్రకారం జరిపిన పరీక్షల ఆధారంగా వచ్చినవి కావని కొట్టిపారేశాయి. తమ కంపెనీలు సరఫరా చేస్తున్న ఈ20 పెట్రోల్ అంతా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన IS 17021 నిబంధనల ప్రకారమే కచ్చితమైన నాణ్యతతో ఉందని, ఇథనాల్ మిశ్రమం 19 నుంచి 21 శాతం లోపే ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. కర్ణాటక ప్రభుత్వం థర్డ్ పార్టీ లాబొరేటరీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆరోపణలు చేస్తోందని, అసలు నమూనాలు సేకరించేటప్పుడు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ఎవరూ లేరని, ఆ పరీక్షల పూర్తి సాంకేతిక వివరాలను కూడా తమకు భాగస్వామ్యం చేయలేదని తప్పుబట్టాయి.

Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?

కేంద్ర సాంకేతిక సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 893 పెట్రోల్ నమూనాలను పరీక్షించగా ఎక్కడా ఎలాంటి లోపాలు బయటపడలేదని, ఇందులో కర్ణాటకకు చెందిన 56 నమూనాలు కూడా ఉన్నాయని, వాటిలో సగటు ఇథనాల్ శాతం 19.30 గానే రికార్డయిందని OMCలు వివరించాయి. కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ ప్రెస్ మీట్ పెట్టి పెట్రోల్‌లో అధిక ఇథనాల్ వల్ల వాహనదారులు భారీగా నష్టపోతున్నారని, సుమారు రూ.1.01 లక్షల కోట్ల మేర మైలేజ్ నష్టం, రిపేర్ ఖర్చులు వస్తున్నాయని చేసిన ఆరోపణలను కూడా ఆయిల్ కంపెనీలు తోసిపుచ్చాయి. రిఫైనరీలు మరియు డిపోలలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ అంతా ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా అత్యంత పారదర్శకంగా సాగుతుందని, మాన్యువల్‌గా ఇష్టమొచ్చినట్లు కలపడం సాధ్యం కాదని పేర్కొన్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తెలంగాణ పల్లెలకు డిజిటల్...

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

పోల్స్