Saturday, November 7, 2026 12:40 PM
Saturday, November 7, 2026 12:40 PM

చీరాలలో వైసీపీ కొంపముంచిన ఆమంచి..!

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా నడిచినా, ప్రతి చోటా వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. కానీ చీరాలలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. దశాబ్ద కాలంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తిగత ఇమేజ్‌తో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 10 వార్డులను కైవసం చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ రేసులోకి రావడం, వైసీపీని మూడో స్థానానికి పడేయడం వెనుక ఆమంచి వ్యూహం స్పష్టంగా పని చేసింది.

Also Read : అసెంబ్లీ కంటే ఘోరం.. నెక్ట్స్ ఏంటి..?

చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఆమంచి కృష్ణమోహన్‌కు దశాబ్దాలుగా బలమైన అనుచర వర్గం, సొంత క్యాడర్ ఉంది. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు పార్టీకి గట్టి పునాది వేశారు. అయితే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, ఈ ఎన్నికల్లో పక్కా స్కెచ్‌తో 44 వార్డులకు గాను 42 వార్డుల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టారు. ముఖ్యంగా వైసీపీకి పడే సాంప్రదాయ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పడంలో ఆమంచి వంద శాతం సఫలమయ్యారు. ఫలితంగా వైసీపీ భారీగా నష్టపోయి కేవలం 8 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ 10 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?

ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యెరిచెర్ల హనీ స్పందన 6,468 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ ఓట్ల శాతాన్ని గమనిస్తే ఆమంచి సృష్టించిన త్రిముఖ పోటీ వల్ల ఓట్లు ఎలా చీలిపోయాయో అర్థమవుతుంది. టీడీపీ అభ్యర్థికి 21,883 ఓట్లు రాగా, వైసీపీకి 15,415 ఓట్లు, కాంగ్రెస్‌కు 11,025 ఓట్లు దక్కాయి. ఒకవేళ ఆమంచి గనుక కాంగ్రెస్ తరఫున ఇంత గట్టిగా బరిలోకి దిగకపోయి ఉంటే, ఈ ఓట్లన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లి ఫలితం హోరాహోరీగా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమంచి ఒంటరి పోరాటం వల్ల ఓట్లు భారీగా చీలిపోవడంతో, టీడీపీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని సులువుగా దక్కించుకునేందుకు మార్గం సుగమమైంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

అనంతపురంలో ఏం జరుగుతోంది.....

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం...

పోలవరం ఇప్పట్లో కష్టమేనా..?...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు...

పోల్స్