Monday, November 2, 2026 08:03 PM
Monday, November 2, 2026 08:03 PM

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్ షా..!

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో హీట్ పెంచేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నిజాం కాలేజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు జాతీయ జెండాతో సాగిన బీజేపీ మహా పాదయాత్ర నగరంలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. పైకి ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఈ యాత్ర జరిగినప్పటికీ, బీజేపీ అసలు వ్యూహం మాత్రం రాబోయే హైదరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : హైదరాబాద్ కి పొంచి ఉన్న నీటి సమస్య.. తక్షణ కర్తవ్యమేంటి?

గత గ్రేటర్ ఎన్నికల్లోనే సంచలన విజయాలు నమోదు చేసిన బీజేపీ, ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ఇప్పటి నుంచే నగర పరిధిలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తూ అమిత్ షాను రంగంలోకి దించి కేడర్‌లో జోష్ నింపారు. ఈ యాత్ర ద్వారా నగరంలోని హిందూ ఓటర్లను, పాతబస్తీ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తూనే, అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఓటు బ్యాంక్‌కు గట్టి గండి కొట్టేలా వ్యూహాత్మక అడుగులు వేశారు.

Also Read : సాయిరెడ్డి కొత్త పార్టీ వెనుక ఆ ఆరుగురు ఎవరు..?

మరోవైపు అమిత్ షా ఈ పర్యటనలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు నగరానికి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో రహస్యంగా రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సామాజిక సమీకరణాలు, పారిశ్రామిక వర్గాల మద్దతు కూడగట్టేందుకే ఈ భేటీలు జరిగాయనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి మొజాంజాహీ మార్కెట్ వద్ద ముగిసిన అమిత్ షా పాదయాత్ర రాబోయే మున్సిపల్ పోరుకు బీజేపీ శ్రేణులను యుద్ధానికి సర్వసన్నద్ధం చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

ఆ విద్యార్థులకు ధైర్యం...

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన...

పోల్స్