Saturday, October 31, 2026 01:40 PM
Saturday, October 31, 2026 01:40 PM

ఏపీ బ్రాండ్ పవర్.. మేడ్‌ ఇన్‌ తిరుపతి.. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత సాధించింది. తిరుపతిలోని ఆల్‌స్టోమ్ కంపెనీలో తయారైన సరికొత్త డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు ముంబై మెట్రో లైన్స్ 4, 4A కోసం సిద్ధమయ్యాయి. ఏపీలోని తిరుపతిలో తయారైన ఈ అత్యాధునిక కోచ్‌లు వాణిజ్య రాజధాని ముంబైకి బయల్దేరడంపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : మిథున్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

ముంబై మెట్రో ప్రాజెక్టు కోసం ఎల్‌ అండ్‌ టీ, ఆల్‌స్టోమ్ సంస్థలు కలిసి మొత్తం 39 డ్రైవర్ రహిత రైళ్లను (ఒక్కో రైలులో 6 కోచ్‌లు) తయారు చేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా కేవలం 90 సెకన్ల గ్యాప్‌తోనే ఒక దాని వెనుక మరొకటి వచ్చేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశారు. పక్కా అంతర్జాతీయ క్వాలిటీ, భద్రతా ప్రమాణాలతో తిరుపతి యూనిట్‌లోనే వీటి తయారీ పూర్తి చేయడం విశేషం.

తిరుపతి నుంచి ముంబైకి కోచ్‌లు తరలివెళ్తున్న ఫోటోలను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏపీలో తయారైన డ్రైవర్‌లెస్ కోచ్‌లు ముంబై మెట్రో కోసం వెళ్లడం చాలా గర్వంగా ఉంది. మన దేశంలో తయారైన ఉత్పత్తులు నగరాల మౌలిక వసతుల అభివృద్ధికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ అని ఆయన కొనియాడారు.

Also Read : చంద్రబాబు లేఖతో రెండు రోజుల్లో రంగంలోకి కేంద్రం..!

తిరుపతి, శ్రీసిటీ ప్రాంతాలు ప్రపంచ స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లుగా మారుతున్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. గతంలో విదేశీ మెట్రోలకు కూడా కోచ్‌లను ఎగుమతి చేసిన ఆల్‌స్టోమ్ సంస్థ, ఇప్పుడు ముంబై మెట్రో రైళ్లను కూడా ఏపీలోనే తయారు చేయడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇది మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ ఇన్ ఏపీ విజన్‌కు నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సెమీ ఫైనల్.. అసలు...

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార...

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

ఏపీలో అర్నబ్ తుఫాన్...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి...

జగన్ వార్నింగ్ కు...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం...

మిథున్ రెడ్డి అరెస్ట్‌కు...

రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

పోల్స్