Saturday, October 31, 2026 11:34 AM
Saturday, October 31, 2026 11:34 AM

ఏపీలో అర్నబ్ తుఫాన్ తెచ్చిన జలకళ..!

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ రాష్ట్రానికి భారీగా జలవనరులను తెచ్చిపెట్టింది. ఎల్ నీనోతో ఇబ్బంది పడుతోన్న రాష్ట్రానికి.. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించి నీటి లభ్యత పెరిగింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా 380 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో అదనంగా 7.63 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కుండపోత వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి.

Also Read : వైసీపీ తుఫాన్ రాజకీయాలు మొదలు..!

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న నీటిపారుదల చెరువులు కూడా జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న నీటిపారుదల చెరువుల్లోకి 22.12 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ వర్షాలు సాగునీటికే కాకుండా భూగర్భ జలాల వృద్ధికి సైతం ఎంతగానో దోహదపడ్డాయి. ఏపీవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగి, అదనంగా 46.2 టీఎంసీల మేర భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. ఇది రాబోయే కాలంలో తాగునీటి, సాగునీటి ఎద్దడిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

Also Read : మన శరీరంలో రెండో గుండె ఎక్కడుందో తెలుసా..?

వర్షాలు జలవనరులను పెంచినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ముప్పు కూడా పొంచి ఉంది. రాష్ట్రంలోని సుమారు 3,900 చెరువులు పూర్తిగా నిండి, నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆయా చెరువుల పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరువు కట్టలు తెగకుండా, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా మారిన చెరువుల వద్ద ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సెమీ ఫైనల్.. అసలు...

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార...

చంద్రబాబు లేఖతో రెండు...

అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సంపై ఏపీ...

జగన్ వార్నింగ్ కు...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం...

మిథున్ రెడ్డి అరెస్ట్‌కు...

రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

మున్సిపల్ పోరు వేళ...

ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్...

పోల్స్