Wednesday, October 28, 2026 07:33 PM
Wednesday, October 28, 2026 07:33 PM

ఇంకా ఎంత కాలం ఇలా ఏడుపు..?

మళ్లీ మళ్లీ అదే ఏడుపు.. ఇది ఎవరో కాదు.. తెలంగాణలో మేమే దొరలం అని చెప్పుకునే భారత రాష్ట్ర సమితి నేతలు. ఆ ఏడుపు సొంత రాష్ట్రం పైన కాదు. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైన. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 12 ఏళ్లు దాటింది. తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మహానుభావును.. మేధావులు.. అయినా సరే.. ఇప్పటికీ సాటి తెలుగు వారిపై అదే ఏడుపు. అధికారం దక్కలేదనే అక్కసుతో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా.. నోటికి వచ్చినట్లు వాగేసి.. ఇప్పటికీ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఈసారి కరువు పాటను కొత్తగా పాడుతున్నారు.

Also Read : తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో చంద్రబాబు సమీక్ష

ప్రస్తుతం కరవు రక్కసి కోరల్లో తెలంగాణ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే జలాశయాల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. ఇక డిసెంబర్ 15వ తేదీ నుంచి నీటి సరఫరాపై కూడా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. నిజానికి ఇదంతా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ తప్పు వల్ల జరిగింది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావం. ఈ ఏడాది తక్కువ వర్షపాతం, అధిక వేడి కారణంగా తాగు, సాగు నీటి కొరత ఏర్పడింది. జలాశయాలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీరు అందుబాటులో లేదు. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఒక పంటకు మాత్రమే నీరు ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఎల్ నినో అనేది సహజంగా వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిందని ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. పొరుగు తెలుగు రాష్ట్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కరువుతో తెలంగాణ జలాశయాలు ఎండిపోతుంటే.. ఏపీ మాత్రం గోదావరి నీటిని దొంగతనంగా పట్టిసీమ ద్వారా తరలిస్తోందంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి గోదావరి నది తెలంగాణ నుంచే భద్రాచలం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ దాటిన తర్వాత నేరుగా సముద్రంలో కలుస్తుంది. అంటే.. ధవళేశ్వరం దాటిన తర్వాత ఆ నీరు వృధాగా సముద్రం పాలవ్వాల్సిందే.

Also Read : రూ. 3 వేల కోసం కక్కుర్తి.. టికెట్ వదులుకున్న వైసీపీ అభ్యర్థి..!

అందుకే ధవళేశ్వరం బ్యారేజ్ పైన పట్టిసీమ వద్ద ఓ లిఫ్ట్ ఏర్పాటు చేసింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. దీని ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తోంది. దీని వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువున్నా కూడా.. గోదావరి నీటి తరలింపు వల్ల కృష్ణా డెల్టాకు నీటిని అందించి.. పంటలను కాపాడుకుంటున్నారు. నిజానికి ఇదంతా ఇప్పుడు కొత్తగా జరగటం లేదు. 2016లోనే పట్టిసీమ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పుడు తెలంగాణలో సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులుగా కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. వారికి పట్టిసీమ లిఫ్ట్ పై పూర్తిస్థాయి అవగాహన ఉంది కూడా. ఇక 2018లో తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేబినెట్‌లో హరీష్ రావు అయితే ఏకంగా జలవనరుల శాఖ మంత్రిగా పని చేశారు కూడా. అంటే ఆ శాఖపైన ఆయనకు కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది.

కానీ ఇప్పుడు మాత్రం కేవలం రాజకీయాల కోసం.. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకెళ్తోందని.. గోదావరి నీటిని ఏపీ చోరీ చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదని అస్సలు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఇంకా చెప్పాలంటే.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 12 ఏళ్ల తర్వాత కూడా నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్ర అనే వేరు భావం తీసుకువచ్చి.. పెత్తనం చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఎలా ఏడుస్తారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బాబోయ్.. అక్టోబర్ నెల...

అక్టోబర్ నెల అంటే చాలు.. ఆంధ్రప్రదేశ్...

రూ. 3 వేల...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల...

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

పోల్స్